Janasena: డల్లాస్ జనసైన్యం ఆధ్వర్యంలో విశాఖ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ కు ఘన సన్మానం..

Janasena: అమెరికాలోని డల్లాస్ రాష్ట్రంలోని జన సైనికులు విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే  వంశీ కృష్ణ యాదవ్ ని ఆదివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు.  డల్లాస్ లోని ది మెరిడియన్ వేదికలో అంగరంగ వైభవంగా ఈ వేడుక ఘనంగా జరిగింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 7, 2025, 03:07 PM IST
Janasena: డల్లాస్ జనసైన్యం ఆధ్వర్యంలో విశాఖ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ కు ఘన సన్మానం..

Janasena: అమెరికాలోని ఎన్నారై జనసేన కార్యకర్తలతో జనసేన విశాఖ పట్నం దక్షిణ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీ కృష్ణ యాదవ్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నారై జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన సమర్థకులు, జనసేన వీరమహిళలు, జనసైనికులు, టీడీపీ-బీజేపీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  నాయకత్వంలో, ప్రధాని నరేంద్ర మోడీ జీ సహకారంతో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చలు  జరిగాయి. ఏపీ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు.  ఇందులో ఎటువంటి సందేహం లేదని వంశీ అన్నారు. గత ఐదేళ్లలో జరిగిన అరాచకం నుంచి ప్రజలు విముక్తి పొందరన్నారు. అంతేకాదు ఏపీ రాష్ట్రం స్వర్ణాంధ్ రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యే చెన్నుబోయని వంశీ యాదవ్  విశాఖపట్నం ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాదు విశాఖ పారిశ్రామిక వృద్ధికి ఎంతో అవకాశాలున్నాయన్నారు. అంతేకాదు పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రదేశం అన్నారు. విశాఖలో  అవకాశాల కోసం ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించాలని కోరారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీ రాజ్ గ్రామీణ విభాగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఆయన హైలైట్ చేశారు. జనసైనికులు ఎమ్మెల్యే తో జనసేన కార్యకర్తలు పలు ప్రశ్నలు సంధించారు.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

మరోవైపు ఎమ్మెల్యే వంశీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర ని డల్లాస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం స్నేహ పూరితమైనది మాత్రమే అని పేర్కొన్నారు. డల్లాస్ జనసైన్యం టీమ్, వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ లోసహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News