Visakha Steel Plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌పై ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో నిరసనలు మొదలయ్యాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను నూటికి నూరుశాతం పైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. విక్రయించేందుకు చర్యలు కూడా తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎంతవీలైతే అంత త్వరగా విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండీసీ ఎండీ అమితవ్ ముఖర్జీ, విశాఖ ఉక్కు ఇన్‌ఛార్జ్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు బలోపేతం కోసం, స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటించే అవకాశముందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చంద్రబాబుకు వివరించారు. విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన చర్యల్ని ప్రస్తావించారు. ప్రస్తుతానికి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు తమ వద్ద లేవని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదంటున్నారు. రానున్న కాలంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వాస్తవానికి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నప్పుడు విశాఖపట్నం ప్రైవేటీకరణ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నారు. అందుకే ప్రైవేటీకరణ ముందుకు కొనసాగలేదు.
Also read: School Holidays: విద్యార్ధులకు బంపర్ న్యూస్, ఏప్రిల్‌లో అన్నీ సెలవులే, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









