Pawan Kalyan: పవన్ కాన్వాయ్ వివాదాం.. అసలు నిజం బైటపెట్టిన విశాఖ సీపీ.. ఏమన్నారంటే..?

Vizag Pawan visits trafficjam: ఇటీవల పవన్ కళ్యాణ్ కాన్వాయ్  కోసం ట్రాఫిక్ ను నిలిపి వేయడం వల్ల తాము జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయలేక పోయామని కొంత మంది విద్యార్థులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 8, 2025, 06:19 PM IST
  • పవన్ కాన్వాయ్ పై రచ్చపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు..
  • నిరాధార ఆరోపణలంటున్న కూటమి నేతలు..
Pawan Kalyan: పవన్ కాన్వాయ్ వివాదాం.. అసలు నిజం బైటపెట్టిన విశాఖ సీపీ.. ఏమన్నారంటే..?

Vizag police clarity on pawan convoy controversy: డిప్యూటీ సీఎం ఇటీవల విశాఖ పట్నం వచ్చినప్పుడు విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని దీని వల్ల తాము జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కు సమయానికి వెళ్లలేక పోయామని కొంత మంది  అభ్యర్థులు పవన్ టూర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  ఈ ఘటన పెందుటర్తి పరిధిలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్స్ కు హజరయ్యేందకు కొంత మంది విద్యార్థులు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు రెడీ అయ్యారు. కానీ అప్పుడు పవన్ కాన్వాయ్ రావడంతో ట్రాఫిక్ ను ఎక్కడిక్కడ నిలిపివేశారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో కొంత మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయలేకపోయామని చెప్పారు. ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు.తన వల్ల జేఈఈ అభ్యర్థులు ఎగ్జామ్ రాయలేకపోయారా...?..దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకుఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన వైజాగ్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.

అసలు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ను ఆపలేదన్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ క్లియర్ గా ఉందన్నారు. తాము వాట్సాప్ లోకేషన్ లను ట్రేస్ చేశామన్నారు. అభ్యర్థులు వెళ్లిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లిందని వైజాగ్ సీపీ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై కావాలని కొంత మంది బురద జల్లాలని కూడా ఈ విధంగా లేనిపోనీ ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు గట్టిగానే కౌంటర్ లు ఇస్తున్నారు. 

ఇదిలా ఉండగా... పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చదువుకుంటున్నారు. తాజాగా.. ఆయన చదువుకుంటున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్క్ శంకర్ చేతికి, కాళ్లకు తీవ్రంగా గాయాలైయ్యాయి. వెంటనే సిబ్బంది పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 19 మంది వరకు గాయపడ్డారు.ప్రస్తుతం పవన్ కుమారుడు కోలుకుంటున్నాడని..డాక్టర్లు చెప్పారు. పవన్ ఈరోజు సాయంత్రం సింగపూర్ కు వెళ్లనున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News