Vontimitta Brahmothsavalu: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్.. టీటీడీ సమీక్ష..

Vontimitta Brahmothsavalu: ఒంటిమిట్టలో కొలువైన  శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో  ఏప్రిల్ 11న  సీతారాముల కళ్యాణం జరుగనుంది. ఈ ఉత్సవానికి  పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు  టీటీడీ.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 2, 2025, 11:30 AM IST
Vontimitta Brahmothsavalu: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్.. టీటీడీ సమీక్ష..

Vontimitta Brahmothsavalu: ఒంటిమిట్టలో త్వరలో జరగనున్న బ్రమ్మోత్సవాలకు  ఈ మేరకు   టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవనం సమావేశపు హాలులో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో పాటు జిల్లా అధికారుల సమావేశం జరిగింది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. వచ్చే ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికారులు, టీటీడీ  సంయుక్తంగా పనిచేయాలన్నారు జిల్లా కలెక్టర్‌.  

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా ఏప్రిల్ 11వ తేదీన జరిగే  సీతారాములవారి కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు  వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు.  పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు రావచ్చనే అంచనాలతో  తగు  ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  
రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణవేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇంఛార్జిగా నియమిస్తామన్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఎక్కడా కూడా జనం తొక్కిసలాట జరుగకుండా అధికారులు, పోలీస్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే మంత్రులు, ఇతర ప్రముఖులకు బస సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాములోరి కళ్యాణానికి భద్రాచలంలో చేసేవారు. రాష్ట్రం వేరు పడిన తర్వాత శ్రీరామ నవమి వేడుకలను ఇక్కడే నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News