Vontimitta Brahmotsavalu: ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలు..

Vontimitta Brahmotsavalu 2025: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామ నవమి ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సారి అక్కడ ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 15 వరకు 11 రోజులు పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 1, 2025, 09:30 AM IST
Vontimitta Brahmotsavalu: ఏప్రిల్ 5 నుంచి ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలు..

Vontimitta Brahmotsavalu:కడప జిల్లా  ఒంటిమిట్ట రామాలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 15 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల పనులను టిటిడి జేఈవో పరిశీలించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీతో కలసి కల్యాణ వేదిక ప్రాంగణాన్ని టిటిడి జేఈవో పరిశీలించారు.  ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కల్యాణ వేదిక పై  ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కల్యాణ వేదిక పక్కన ఉన్న పీఏసీ బిల్డింగ్ పనులను పరిశీలించారు. ఇక్కడ సీతారామ కళ్యాణం పౌర్ణమి ఘడియల్లో రాత్రి పూట మాత్రమే నిర్వహిస్తారు.

Add Zee News as a Preferred Source

ఏప్రిల్ 11వ తేదీన  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప ఎయిర్ పోర్ట్ నుండి ఒంటిమిట్ట కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి రానున్న మార్గాలలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో చర్చించారు. బాకారాపేటలో పార్కింగ్ రోడ్ డైవర్షన్ మార్గాలను, భక్తులు ప్రవేశించే, నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా ఏర్పాటు చేయాలని సూచించారు.  గ్యాలరీలలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, సీతారాముల కళ్యాణం ముత్యపు తలంబ్రాలు ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు చేయాలన్నారు కలెక్టర్. అత్యవసర పరిస్థితుల్లో గ్యాలరీల నుండి బయటకు వచ్చేలా అత్యవసర మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద పెండింగ్ పనులు, మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ. ఎలాంటి తొక్కిసలాటలకు అవకాశం లేకుండా క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కల్యాణ వేదిక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన పలు సూచనలకు తగ్గట్లుగా అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక, పోలీసు, అన్నప్రసాదాలు పంపిణీకి  ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని జేఈవో సూచించారు.  అనంతరం పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ, పోలీసు, టిటిడి అధికారుల సమావేశంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News