Vontimitta Kodandarama Swamy Temple: ఆంధ్ర ప్రదేశ్ లో ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా పండు వెన్నెలలో కళ్యాణం జరపడం ఇక్కడ అనవాయితిగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం తర్వాత రెండవ అయ్యోధ్య గా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్యాణోత్సవం ను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. కల్యాణోత్సవం సందర్భంగా ఓంటిమిట్టలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గత ఏడాది మూడులక్షల మంది భక్తులు రాములవారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ ఏడాది ఐదు లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణం పౌర్ణమి రోజు పండు వెన్నెలలో జరుగుతుంది. ఆంజనేయుడు లేని ఏకైక రామాలయంగా ప్రసిద్ధి గాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కల్యాణోత్సవ ఘట్టానికి అత్యంత ప్రాధాన్యతను ఉంది. స్వామి వారి కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య జరుగుతుంది. కల్యాణోత్సవం తిలకించడం కోసం 47 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ముత్యాల తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు ను ఏర్పాటు చేశారు.
ఆలయంలో సీతా, రామ, లక్ష్మణ విగ్రహాలు ఒకే శిలతో ఉండటం వల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరమని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవిని ఒకే శిలపై చెక్కారు.. ఈ ఆలయంలో ఆంజనేయుడు ఉండకపోవడం కూడా ప్రత్యేకత. శ్రీరామ చంద్రుడు , ఆంజనేయ స్వామి కలవక ముందే ఈ ఆలయం నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









