)
Summer School Holidays: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరిగిపోతుండగా.. వారికితోడు ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో కళకళలాడుతున్నాయి. శనివారం రోజు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ, ప్రభుత్వ అధికారులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఏపీ ప్రభుత్వ విప్ గణబాబు, దివంగత నటుడు కృష్ణంరాజు భార్య, సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు మెహర్ రమేష్, విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని శనివారం తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరందరికీ ఆలయ అధికారులు ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుమల స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన సముద్రఖని మీడియాతో మాట్లాడుతూ.. 'నా ఆప్తమిత్రుడు, తోబుట్టువు లాంటి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి విజయ్ తమిళనాడులో సుపరిపాలన అందించాలని నేను స్వామిని వేడుకున్నా' అని నటుడు సముద్రఖని తెలిపారు.
తిరుమల ఆలయాన్ని శ్రీవాణి విరామ సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. రెండు రోజుల తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా మొదటగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకి వచ్చారు. వారికి టీటీడీ ఈఓ స్వాగతం పలికి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపం లో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రం తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook