Rain Alert: బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు..

Rain Alert: ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. భూ ఉపరితలం వేడక్కడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 1, 2025, 09:50 AM IST
Rain Alert: బిగ్ అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు..

Rain Alert: నేటి నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆదిలాబాద్​, నిర్మల్​, కుమురం భీం, నిర్మల్​, నిజామాబాద్​, కామారెడ్డి, మహబూబ్‌నగర్​, వనపర్తి, జోగులాంబ గద్వాల్​, వికారాబాద్​ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

Add Zee News as a Preferred Source

మరోవైపు ఈనెల 3 తరువాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో వచ్చే రెండు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ 3న వడగండ్లు కురిసే అవకాశముందని  వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసింది.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News