)
Weather Updates: ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. తాజాగా విపత్తుల నిర్వహణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
విశాఖ, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించారు.
అలాగే కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందన్నారు అధికారులు. ఈదురు గాలులు సైతం వీస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
వర్షాలు పడే సమయంలో ప్రజలు ఇంట్లోనే అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద ఉండటం సేఫ్ కాదన్నారు. ఒకవేళ వర్షం పడే సమయంలో బయట ఉన్నట్లయితే.. ఎక్కడైనా సురక్షిత స్థలంలో తలదాచుకోవాలని అధికారులు జాగ్రత్తలు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook