)
AP Heat Waves: వేసవి ప్రారంభంలోనే భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటోంది. భానుడి ప్రతాపంతో ఏపీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా తాజాగా మరో అగ్నిగుండం లాంటి వార్త వచ్చింది. బుధవారం ఏపీలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వేసవికాలం సందర్భంగా వాతావరణం విశేషాలను విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాబోయే రెండు, మూడు రోజుల వాతావరణానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. రానున్న రెండు రోజుల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని తెలిపారు. రేపు గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఉంటాయని ప్రకటించారు. శుక్రవారం వడగాల్పుల ప్రభావం తగ్గుతుందని.. కానీ కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుందని చెప్పారు. బుధవారం నంద్యాల జిల్లా ఆత్మకూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 40 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా వేంపల్లి, కృష్ణా జిల్లా కంకిపాడులో 39 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 143 ఉన్నాయి. ఆ జిల్లాలు ఇవే!
శ్రీకాకుళం జిల్లా 11 మండలాలు, విజయనగరం జిల్లాలో 17 మండలాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో 9 మండలాలు
అల్లూరి జిల్లా 6, కాకినాడ జిల్లా 2, కోనసీమ జిల్లా 5, తూర్పుగోదావరి జిల్లా 16,
పశ్చిమగోదావరి జిల్లా 16
ఏలూరు జిల్లా 14 మండలాలు
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా 19 మండలాలు
గుంటూరు జిల్లా 12 మండలాలు
బాపట్ల జిల్లా 15 మండలాలు
పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట మండలం
శుక్రవారం ఈ ప్రాంతాల్లో వడగాల్పులు
అల్లూరి జిల్లాలో అడ్డతీగల, దేవిపట్నం, గంగవరం, రంపచోడవరం మండలాలు, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఎల్లుండి శనివారం 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 94 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
వడగాల్పులకు జాగ్రత్తలు ఇవే!
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదు అని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది. సాధ్యమైనంత వరకు ప్రజలు ఎండలో తిరగరాదని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.