AP Rains: ఏపీకి బిగ్ రెయిన్ అలర్ట్.. పిడుగుల వానలు..

AP Rains: ఆంధ్ర ప్రదేశ్ లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకున్నాయి. ఓ వైపు ఎండలు ప్రజలను ఉక్కబోతకు గురి చేస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 17, 2025, 08:20 AM IST
AP Rains: ఏపీకి బిగ్ రెయిన్ అలర్ట్.. పిడుగుల వానలు..

AP Rains: దేశ వ్యాప్తంగా ఎండా కాలం భిన్నంగా ఉంది. ఓ మండుతున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా.. రైతులకు మాత్రం  ఈ వర్షాలు కడగండ్లు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఎండు మిర్చి సహా ఇతర పంటలు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షం ముందు వచ్చే తీవ్రమైన గాలులకు అవి కొట్టుకుపోతున్నాయి. మరోవైపు మామిడి సహా ఇతర పంటలకు సంబంధించిన కాయలు రాలిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Add Zee News as a Preferred Source

మొత్తంగా మండిపోతున్న ఎండలతో పాటు   అకాల వర్షాలు  కామన్ పీపుల్ కు కంటి మీద  కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి.  బీదీంతో ప్రజలు మరో సారి అప్రమత్తంగా వుండాలని విపత్తు నిర్మహణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది.

ఇవాళ ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలతో పాటుగా చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కర్నూలులో 40.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది.  అనకాపల్లి జిల్లా చీడికాడలో42.5 మిమీ అధిక వర్షపాతం నమోదైంది.

మరోవైపు తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు కురువనున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, భూపాలిపల్లి జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు  ములుగు, నాగర్ కర్నూలు,  ఆదిలాబాద్, నిర్మల్  జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News