Heavy Rains: నిత్యం ఎండలతో సతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వర్షాలకు తోడు గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది అర్ధరాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించింది. వీటి ప్రభావంతో 2 రోజులపాటు వర్షాల పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే కోస్తాంధ్ర మత్స్యకారులు ఇవాళ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపాయి. ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రజలు ఈ సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సముద్రంలో తీవ్ర బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయి. అంతేకాదు మత్స్య కారులు ఈ సమయంలో సముద్రంలో వేటకు వెళితే ప్రమాదం అని హెచ్చరికలు జారీ చేసింది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









