Heat Waves in AP: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. భానుడి భగభగలకు అల్లాడుతున్న ప్రజలు..

Heat Waves in AP: ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 10 గంటల తర్వాత బయటకు అడుగపెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 7, 2025, 08:20 AM IST
Heat Waves in AP: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. భానుడి భగభగలకు అల్లాడుతున్న ప్రజలు..

Heat Waves in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భానుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏకంగా ఏపీలోని  670 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీకాకుళం జిల్లాల్లోని 30కి పైగా మండలాల్లో తీవ్రత ఎక్కువ ఉంటుందని వెల్లడించింది.

Add Zee News as a Preferred Source

అల్లూరి జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు  అయ్యే అవకాశాలు తెలిపింది.
సోమవారం రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల 40.7, నంద్యాల జిల్లా దొర్నిపాడు 40.6, పల్నాడు జిల్లా రావిపాడు 40.5°, శ్రీకాకుళం జిల్లా పొందూరు 40.3లో చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News