
Auto Driver Sevalo Amount Not Credited: కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.15000 నేటి నుంచి జమ కానున్నాయి. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో ఈ నిధులు జమ చేస్తున్నారు. వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం
గత నెలలోనే ఆటో డ్రైవర్ల సేవలోకు సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసింది. తర్వాత వారి ఖాతాల్లో నేటి నుంచి రూ. 15వేలు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 90 వేల మందికి పైగా ఆటో, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్ల ఖాతాలో రూ.436 కోట్ల మేర లబ్ధి చేకూరాలని ఉంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొంటారు. ఈ పథకానికి లో మీ పేరు లేకపోతే ఏం చేయాలో తెలుసుకుందాం.
ప్రతి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతి అర్హుడైన ఆటో క్యాబ్ డ్రైవర్లకు రూ.15000 చొప్పున సంవత్సరానికి ప్రభుత్వం అందించబోతుంది. గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే అందించింది. దాన్ని పెంచి తాజా కూటమి ప్రభుత్వం రూ.15000 చేసింది ఈ నిధులు నేరుగా ఆటో రిక్షా డ్రైవర్ల ఖాతాలో జమ కానున్నాయి. శ్రీ శక్తి బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొనే ఇబ్బందుల వల్ల ప్రభుత్వం స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
అర్హులైన ప్రతి లబ్ధిదారుకి పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండిల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ మీరు అర్హులై ఉండి ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొంది ఉండాలి. మీరు మీ పథకంలో మీ పేరు లేకపోతే గ్రీవెన్స్ సెల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఇక ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో మీరు స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. మీరు ఎన్బీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేస్తే మీరు అర్హులా కాదా అనేది తెలిసిపోతుంది. గత నెల 17వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన కూటమి ప్రభుత్వం తుది జాబితా కూడా తయారు చేసి నేటి నుంచి ఆ నిధులు విడుదల చేయనుంది. అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే ఖచ్చితంగా మీ వద్ద సరైన డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ప్రదేశ్ అయి ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook