)
Rishikonda:డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ మన దేశంలోని సముద్ర తీరాలు స్వచ్చమైనవి అనే దానికి ఈ గుర్తింపు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ సంస్థ రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది. రుషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఇలా జరిగిందన్నారు. బీచ్ నిర్వహణను ప్రైవేట్ సంస్థకు వదిలేయడం కూడా కారణం అంటున్నారు.
2020లో రుషికొండ బీచ్‌కు FEE సంస్థ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో రుషికొండ బీచ్‌కు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. అయితే బ్లూఫ్లాగ్ గుర్తింపు ఇచ్చే డెన్మార్క్‌కు చెందిన FEE కొన్ని నిబంధనలు విధించింది. బీచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాల్సి ఉంటుంది. బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచుతూ.. నీటి నాణ్యత, భద్రత, పర్యావరణ నిర్వహణను పక్కాగా పాటించాల్సి ఉంటుంది.
కొద్దిరోజుల క్రితం FEE కి ఫిర్యాదులు అందాయి. రుషికొండ బీచ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. బీచ్‌లో వ్యర్థాలు పేరుకుపోయాయన్నారు. సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్నారు. వాష్‌రూమ్‌లు సరిగా లేవని, కుక్కలు వస్తున్నాయన్నారు. ఇక ఆడవాళ్లు దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా ఉన్నాయని ఫొటోలతో సహా ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఎఫ్ఈఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు గత నెలలో కలెక్టర్‌కు మెయిల్ ద్వారా సమాచారం పంపించారు. ఈ మేరకు బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ గుర్తించినట్లుగా ఎగురవేసే జెండాలను దించేయాలని సూచించింది సదరు సంస్థ. అలాగే ఈ విషయాన్ని నోటీసు బోర్డులో కూడా ప్రస్తావించాలని సూచించారు. బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు విషయం తెలియడంతో సీఎస్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆ వివరాలు పంపించారు. ఈ మేరకు దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం.
విశాఖపట్నం రిషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు అంశంపై పర్యాటక శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉపసంహరణ తాత్కాలికమేనన్నారు. త్వరలో పునరుద్ధరిస్తారని తెలిపింది. అతి త్వరలోనే రుషికొండ బీచ్‌లో ప్రమాణాలను పెంచుతామన్నారు. మళ్లీ బ్లాఫ్లాగ్ గుర్తింపు సాధిస్తామని ప్రకటించింది. ఈ సర్టిఫికెట్ ఉపసంహరణ తాత్కాలికమేనని చెబుతున్నారు. ఈ నెల 4న భద్రతా ఆడిట్ తర్వాత బ్లూఫ్లాగ్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe