YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయాక వైసీపీకి కష్టాలు వీడటం లేదు.. ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా కూటమి పార్టీల్లోకి జంపింగ్ చేస్తున్నారు. ఇటీవల ఫ్యాన్ పార్టీలో నెంబర్ టూగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఆయన్ను పార్టీ వీడొద్దని స్వయంగా పార్టీ అధినేత జగన్ వారించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన రాజీనామాతో ఉత్తరాంధ్రలో పార్టీకి ఇంచార్జ్ లేకుండా పోయారు.. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలా పార్టీ అధినేత జగన్ తీవ్ర కసరత్తే చేశారు. చివరకు మాజీమంత్రి కురసాల కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు. అయితే వచ్చి రాగానే కన్నబాబుకు సొంత పార్టీ లీడర్లే చుక్కలు చూపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ లీడర్లతో ఇంఛార్జ్ కురసాల కన్నబాబు తొలిసారి భేటీ అయ్యారు. విశాఖలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో బొత్స ఈ పదవికి ఆశించారు. అందుకే కన్నబాబు మీటింగ్‌కు హాజరు కాలేదని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత. ఆయను విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. అందుకే ఆయనకు వైఎస్ జగన్ పట్టుబట్టి మరి ఎమ్మెల్సీ సీటుకు కట్టబెట్టారు. అప్పట్లో బొత్సకు ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తారని టాక్ సైతం వినిపించింది. కానీ అనేక సమీకరణాల తర్వాత వైఎస్ జగన్ కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు.
ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణకు జగన్ అనేక బాధ్యతలు అప్పగించారు. అందుకే కన్నబాబుకు చాన్స్ ఇచ్చారని సొంత పార్టీ లీడర్లు చెబుతున్నారు. కానీ ఈ పదవిపై బొత్స సత్య నారాయణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అనుచరులు చెబుతున్నారు. అందుకే తొలిసారి విశాఖ వచ్చిన కన్నబాబు మీటింగ్‌కు బొత్స రాలేదని చెబుతున్నారు. కానీ కన్నబాబుకు స్వాగతం పలికేందుకు మూడు జిల్లాల నుంచి పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు.
అయితే బొత్సకు కన్నబాబుకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని రానున్న రోజులలో ఇద్దరూ కలసి పనిచేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా కన్నబాబు మీటింగ్‌కు బొత్స హాజరుకాకపోవడంపై వైసీపీలో రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బాధ్యతలను కన్నబాబుపై అప్పగించడంతోనే పార్టీ హైకమాండ్‌పై బొత్స గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఉద్ధండ పిండాల్లాంటి వైసీపీ లీడర్లు ఉన్న నేపథ్యంలో కన్నబాబు వారితో ఎలా నెగ్గుకు వస్తారని చర్చ సొంత పార్టీలో జరుగుతోంది..
Also Read: Hero Spender EV: హీరో స్పెండర్ ఎలక్ట్రిక్ బైక్ 2025 వచ్చేస్తోంది.. ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇవే!
Also Read: Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








