)
Woman tied to a tree and beaten brutally in kuppam: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుప్పం మండలం నారాయణ పురం గ్రామంలో జరిగిన ఘటన ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా దుమారంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఘెరం చోటు జరిగింది.
నారాయణ పురంకు చెందిన తిమ్మరాయప్ప అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ. 80 వేల అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత అప్పులు తీరకపోవడంతో గ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో.. ఊరు విడిచి వెళ్లిపోయారు. మరోవైపు.. అతని భార్య.. శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచబల్లలో ఉంటూ బెంగళూరులో కూలీపనుల కోసం వెళ్తు జీవనం సాగిస్తున్నారు.
SHOCKING HORROR in Andhra Pradesh!
In CM Chandrababu Naidu’s own Kuppam, a 25-yr-old woman was tied to a tree & beaten brutally by a TDP worker for failing to repay a loan her husband took years ago and abandoned her and her children.
What’s happening to women’s safety in… pic.twitter.com/9kf1c84nsx
— SCRIBE NOW (@TheScribeNow) June 17, 2025
ఇటీవల శిరీష.. తన కొడుకు టీసీ కోసం నారాయణ పురం వచ్చింది. ఇది కాస్త అప్పులు ఇచ్చిన వారికి తెలియడంతో.. ఆమె దగ్గరకు వచ్చారు. శిరీషతో వాగ్వాదంకు దిగి, ఆమెను చెట్టుకు కట్టేసి మరీ కొరడాతో కొట్టారు. కొడుకు ఏడుస్తున్న కూడా.. శిరీష పట్ల ఒక మహిళ అని కూడా చూడకుండా బూతులు తిడుతూ నీచంగా ప్రవర్తించారు. మహిళను కొట్టిన వాళ్లు టీడీపీకి చెందిన వారిగా ప్రచారం జరుగుతుంది.
ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ కూటమి సర్కారు పాలనలో.. మహిళలపై ఆగని ఘోరాలు అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన ఏపీలో రాజకీయంగా కూడా ఈ ఘటన కాంట్రవర్సీగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook