
women playing gambling game cards in vizag: సాధారణంగా జూదం ఆడటం పెద్ద నేరం. పోలీసు శాఖ నిరంతరం వీరిపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇలాంటి ఘటనపై పోలీసులు ఉక్కుపాతం మోపుతుంటారు. ఎక్కడ జూదం ఆడిన కూడా వారిని అడ్డంగా పట్టుకుంటారు. వీరిపై కేసుల్ని నమోదు చేస్తారు. జుదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ ఘటనలు వార్తలలో తరచుగా నిలుస్తునే ఉంటాయి. అయిన కూడా కొంత మంది దీన్ని వదిలించుకోలేక, అడిక్ట్ అయి జూదం ఆడుతూ తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు.
ఇటీవల భర్తల్ని చంపుతున్న ఘటనల్లో భార్యలు కీ రోల్ ప్లే చేస్తున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. అయితే తామేం.. తక్కువ తిన్నామా.. అన్నిరంగాలలో రాణిస్తున్నాం.. మరీ జూదంలో కూడా ఎందుకు తగ్గాలో అని అనుకున్నారో ఏంటో కానీ కొంతమంది మహిళలు జూదం ఆడుతూ రెచ్చిపోయారు. వైజాగ్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
వైజాగ్ లోని లలిత నగర్ లో.. ఇటీవల నాలుగో టౌన్ పరిధిలో పోలీసులు కొంత మంది మహిళలు రోజు జూదం ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జూదం జరుగుతున్న ప్రదేశంకు వెళ్లారు. అక్కడ వెళ్లి దాడులు చేయగానే పోలీసులు షాక్ అయ్యారు. అక్కడ అందరు మహిళలు ఉన్నారు. దాదాపు 20 వేల వరకు నగదు అక్కడ ఉంది.
కొంత మంది సిగరెట్ లు కాలుస్తు, మద్యం కూడా తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి మహిళ పోలీసుల్ని రప్పించారు. ఆరుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జుదం ఆడుతున్న మహిళల్ని చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook