Sree Charani Gets Bumper Offer From Ap Govt: టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణిపై చంద్రబాబు సర్కార్ వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారంను ప్రకటించింది. అంతేకాదు పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలంను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో శ్రీ చరణి స్వయంగా చెప్పారు. మహిళా వన్డే ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో శ్రీ చరణి సభ్యురాలు అన్న విషయం తెలిసిందే.
సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబుని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శ్రీచరణి కలిసింది. వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. వన్డే ప్రపంచకప్ గెలిచినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు శ్రీచరణిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలుచుకున్న మధుర క్షణాలను వారితో శ్రీచరణి పంచుకుంది. మహిళా క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచిందని సీఎం ప్రశంసించారు.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో 21 ఏళ్ల శ్రీ చరణి అదరగొట్టిన సంగతి తెలిసిందే. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఏపీలోని కడప జిల్లాలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీచరణి వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుకుంది. ఈ టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచింది.
Also Read: Free Internet: తెలంగాణ విద్యార్థులకు బంపర్ న్యూస్.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ ఇంటర్నేట్ సేవలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









