Yanamala Rama Krishnudu: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. యనమల రామకృష్ణుడు సహా ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తయ్యింది. దాంతో యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వర రావు, పాకలపాటి రఘువర్మకు శాసన మండలి ఘనంగా వీడ్కోలు పలికింది. వీళ్ల సేవలను కొనియాడుతూ సభ్యులు ప్రసంగించారు. యనమల రామకృష్ణుడు సభకు గైర్హాజరైనా కూడా ఆయన సేవలను నేతలు కొనియాడారు. స్వయంగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఆయనకు ఫోన్ చేసి ఆహ్వానించినట్లు సమాచారం. వీడ్కోలు సందర్భంగా జరిగిన గ్రూప్ ఫోటోకు కూడా యనమల రాలేదు. దీంతో యనమల మండలికి ఎందుకు రాలేదన్న చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది..
ఇక తెలుగుదేశం పార్టీలో యనమలను అందరూ నెంబర్ టూ లీడర్‌గా చెప్పుకుంటారు. సీఎం చంద్రబాబు తర్వాతే పార్టీలో ఆయనే సీనియర్ లీడర్. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ద్వారా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. 75 ఏళ్ల వయసున్న యనమల రామకృష్ణుడు దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎమ్మెల్సీగా పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాసనమండలి ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ సమావేశానికి ఆయన గైర్హాజరు కావడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితోనే ఆయన గైర్హాజరు అయ్యారని ప్రచారం సాగుతోంది.
ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల నియామకం జరిగింది. మొత్తం ఐదుగురు నేతలు పెద్దల సభలో అడుగుపెట్టారు. టీడీపీ నుంచి ముగ్గురు జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలు అయ్యారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తారని భావించినా యనమలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయన్ను కంటిన్యూ చేయలేదు. దాంతో ఆయన సీఎం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం.. యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఎప్పుడూ అన్యాయం చేయలేదని అంటున్నారు. నాలుగు దశాబ్ధాల కాలంలో యనమలకు మంత్రిగా, స్పీకర్ గా, మండలిలో ప్రతిపక్ష నేతగా కూడా అవకాశం కల్పించారని చెబుతున్నారు.
అంతేకాదు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో యనమల కోరిన సీట్లు ఇచ్చారని అంటున్నారు. యనమల కుమార్తె దివ్యకు తుని టికెట్ ఇచ్చారు. అల్లుడికి ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయన గెలిచారు. అటు వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా కీలకమైన పదవులన్నీ యనమల ఫ్యామిలీకే దక్కాయని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి యనమలకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదని అంటున్నారు. మరోవైపు కాకినాడ సెజ్ భూముల విషయంలో పార్టీ వైఖరికి భిన్నంగా యనమల వాయిస్ వినిపించారు. చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబును కలిసి నేరుగా తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉన్నా యనమల పార్టీ పరువును బజారున పెట్టారు. అయినా హైకమాండ్ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతా చేసిన యనమల అంటే సీఎం చంద్రబాబుకు ఎంతో గౌరవం అంటున్నారు. మొత్తంగా యనమలకు త్వరలోనే ఓ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు.
Also Read: Investment Plan: సామాన్యులకు అదిరిపోయే వార్త..250రూపాయలతో సిప్..ధనవంతులవ్వడం పక్కా
Also Read: Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మరో లొల్లి.. భార్యతో విష్ణు విడాకులు..!.. కామెంట్స్ వైరల్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









