Jyoti Malhotra Case: పహల్గామ్ ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ట్రావెత్ విత్ జో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. ఉగ్రవాది జ్యోతి అరెస్ట్ తరువాత ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటికొస్తున్నాయి.
యూట్యూబర్ ఉగ్రవాది జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆమెను వివిధ కోణాల్లో విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లో సంబంధాలున్నాయని జ్యోతి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమీషనర్ దానిష్‌తో చాలాసార్లు సంప్రదింపులు జరిపినట్టుగా విచారణలో వెల్లడైంది. 2023లో మొదటిసారి దానిష్ అలియాస్ ఎహ్సాన్ దార్‌ను కలిసినట్టు జ్యోతి వెల్లడించింది. ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పర్యటన సందర్భంగా దానిష్ స్నేహితుడైన అలీ హసన్‌ను కలిసింది. పాకిస్తాన్‌లో బస, ప్రయాణ ఏర్పాట్లు అన్నీ అతనే ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న షకీర్, రాణా షాబాజ్ లను అలీ హసనే తనకు పరిచయం చేసినట్టు జ్యోతి తెలిపింది.
ఇతరులెవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఫోన్‌లో మాత్రం జట్ రాథావా పేరుతో షకీర్ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుంది. ఇండియాకు వచ్చిన తరువాత కూడా వాట్సప్, స్నాప్‌చాట్, టెలీగ్రామ్ వేదికల ద్వారా పాకిస్తాన్ ఇంటెల్ ఏజెంట్లతో ఉగ్రవాది జ్యోతి మల్హోత్రా సంబంధాలు కొనసాగించింది. ఈ విషయాలన్నీ విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆమె పర్సనల్ డైరీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ పర్యటన అనంతరం ఆ దేశ ఆతిథ్యంపై జ్యోతి ప్రశంసలు కురిపించింది. డైరీలో ఈ విషయాలు రాసింది కానీ ఎప్పుడు వెళ్లిందనేది తేదీ మాత్రం రాసుకోలేదు. ఇండియాలో ఉన్న హిందూవులు పాకిస్తాన్‌లోని తమ పూర్వీకులుండే ప్రదేశాలను సందర్శించాలని జ్యోతి రాసుకుంది. పహల్గామ్ దాడికి మూడు నెలల ముందు కూడా జ్యోతి ఈ ప్రాంతాన్ని సందర్శించింది.
Also read: Severe Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక, జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









