)
YS Bharathi With YSRCP: వైసీపీ అంటే జగన్.. జగన్ అంటే వైసీపీ.. ఫ్యాన్ పార్టీలో ఎవర్ని అడిగినా ఇదే విషయాన్ని చెబుతారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ కుటుంబంలో ఎవరూ పార్టీ వ్యవహారాల్లో కల్పించుకోలేదు.. చివరకు జగన్ భార్య వైఎస్ భారతి రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ వైఎస్ భారతి రెడ్డి సడెన్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీలో కీలక నేతలతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలో కీలక నేతలతో ఆమె చర్చించినట్లు సమాచారం. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. జగన్‌కు నమ్మకస్తుడు, రిటైర్డ్ అధికారి ఫోన్‌తో భారతి రెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. మధ్య, దిగువ శ్రేణి నేతలకు ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో వైఎస్ భారతి రెడ్డి ఎంట్రీ ఇచ్చినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైఎస్ భారతి ఇన్నాళ్లుగా తమ కుటుంబానికి సంబంధించిన అనేక వ్యాపారాలను చూస్తున్నారు. పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తున్నారు.. ఇప్పటివరకు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె పాత్ర నామమాత్రమే. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక వైస్ భారతి అవసరం పార్టీకి ఉందని నేతలు గుర్తిస్తున్నారు. ఆమె అయితే అటు షర్మిలకు.. ఇటు చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇస్తారనే భావనలో జగన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్‌ను కేసులు వెంటాడుతున్నాయి. త్వరలోనే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ తన అరెస్టు జరిగితే.. పార్టీకి మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు పార్టీని ముందుండి నడిపించేవాళ్లు కావాలి.. ప్రస్తుతం పార్టీలో తన నీడను కూడా నమ్మని స్థితిలో జగన్ ఉన్నారు. అందుకే ఆమెను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని వైఎస్ జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు వైసీపీలో మహిళ లీడర్లకు కొదవలేదు. గత వైసీపీ పాలనతో కొత్త నేతలకు కూడా మంత్రులుగా జగన్ అవకాశం కల్పించారు. కానీ పార్టీ అధికారం కోల్పోవడంతో వారంతా సైలెంట్ అయ్యారు. ఇందులో మాజీమంత్రి ఆర్కే రోజా, విడదల రజినీ, లాంటి లీడర్లు మాత్రమే తిరిగి యాక్టివ్ అయ్యారు. కానీ వైఎస్ షర్మిలా కావొచ్చు.. మరికొందరు టీడీపీ నేతలను నోర్లు మూయించడానికి భారతిని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. భారతి అయితేనే షర్మిల నోరు మూయించ గలుగుతారని నేతలు కూడా జగన్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. చివరకు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న జగన్.. నేరుగా భారతి రెడ్డిని రంగంలోకి దింపారని అంటున్నారు.
మొత్తంమీద వైఎస్ భారతి పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో మాజీమంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు, లాంటి లీడర్లు ఉన్నారు. అయితే వీరిని కాదని భారతి రెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై చర్చ జరుగుతుండగా.. వీరంతా భారతి రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ భారతి రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook