YS Jagan Speech: 'కష్ట సమయంలో ఉన్న కార్యకర్తకు ఒక్కటే చెబుతున్నా. మీరు చూపిస్తున్న ఈ స్ఫూర్తికి, నిబద్ధతకు నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటా. రాబోయే రోజులు మనవే' అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 'కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. ఈసారి కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది' సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. 'ఈ సారి అధికారంలోకి వచ్చాక నేను కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటా. జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు అన్యాయం జరగదు' అని చెప్పి పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పూర్తి భరోసా ఇచ్చారు.
Also Read: TTD Decisions: తిరుమలను ప్రక్షాళన చేయాల్సిందే! టీటీడీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. కార్యకర్తలు, నాయకులకు పూర్తి భరోసా ఇస్తూ ఎన్డీయే కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 'జగన్ 1.0లో చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. అధికారంలోకి వచ్చాక కోవిడ్‌తో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం శ్రమించడంతో కార్యకర్తలకు తోడుగా ఉండలేకపోయాం' అని జగన్ తెలిపారు. కానీ జగన్ 2.0లో అలా జరగదని స్పష్టం చేశారు. 'కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటానని అందరికీ మాట ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత తాను చేసి చూపిస్తానని తెలిపారు.
Also Read: HCU 400 Acres: ఢిల్లీకి చేరిన హెచ్‌సీయూ భూముల వివాదం.. కాపాడాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు
'చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కి చేరాయి. చాలా మంది చంద్రబాబు మారి ఉంటాడని భావిస్తే మారలేదని నిరూపితమైంది' అని మాజీ సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. ప్రజలు నవ్వుకుంటున్నారు' అని వివరించారు. తాను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్టు అబద్దాలు మీద అబద్దాలు చంద్రబాబు చెబుతూ పోతున్నాడని విమర్శించారు. 'సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదు అంటే రాష్ట్రం అప్పులపాలైందని అంటాడు. హామీలు ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్దాలు చెబుతున్నారు' అని ఆరోపించారు. 'దిక్కుమాలిన అబద్దాలు, మోసాలతో చంద్రబాబు పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మరలా మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను చూసి తపించే గుండె ఉండే మంచి పాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









