YS Jagan comments on pawan kalyan controversy: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి వర్సెస్ వైఎస్సార్సీపీల మధ్య రాజకీయాలు తగ్గా ఫార్ నడుస్తుందని చెప్పుకొవచ్చు. అయితే.. మాజీ సీఎం జగన్ ఇటీవల పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయాల్ని సమ్మర్ లో మరింత హీట్ ను పెంచేశాయి. జగన్ ఇటీవల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ .. అంటూ సెటైర్ లు వేశారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారాయి. దీనిపైన జనసేన లో నెంబర్ టూగా ఉంటున్న నాదేండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు.
కొడికత్తికి ఎక్కువ.. గొడ్డలిపోటుకి తక్కువ... అని మాట్లాడారు. అదే విధంగా ఏపీ మంత్రి నారాలోకేష్ సైతం.. వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని ఖండించారు. అయితే.. గతంలో జగన్ రాజకీయాల్లో తన దైన చాణక్యంతో ముందుకు వెళ్లేవారు. కొన్నిసార్లు టీడీపీని టార్గెట్ చేస్తు, మరికొన్నిసార్లు జనసేనను టార్గెట్ చేస్తుండేవారు. ముఖ్యంగా చంద్రబాబును వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకున్నాడని వ్యాఖ్యలు చేసేవారు.
పవన్ మీద ఆయన చేసుకున్న పెళ్లిళ్లపై కాంట్రవర్సీగా మాట్లాడేవారు.ఈ క్రమంలో గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలతోనే.. ఎలాగైన జగన్ కు బుద్ది చెప్పాలంటే.. టీడీపీ, జనసేన ఒక్కటవ్వాలని భావించాయంట. అసలు.. వీరిద్దరు కలవడానికి ఇన్ డైరెక్ట్ గా జగన్ కారణమని చాలా మంది నేతలు అన్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చాక.. సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య సీక్రెట్ వార్ నడుస్తొందని.. పవన్ సీఎం కావాలని అనుకుంటున్నారని, నారా లోకేష్ తో పొసగటంలేదని.. ఇటీవల వైసీపీ అనుకూల మీడియాలు, ట్రోలర్స్ లు తెగ ప్రచారం చేశారు.
కానీ ఇటీవల జగన్ వ్యాఖ్యలపై .. మంత్రి నారాలోకేష్ స్పందిచడంతో.. జగన్ టీమ్ పన్నాగాలకు బెడిసికొట్టినట్లే అని కూటమి పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనితో టీడీపీ, జనసేనల మధ్య అంతర్గత విభేదాలు లేవని స్పష్టం అయిపోయిందని కూడా కూటని నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం.. జనసైనికులు ఫుల్ ఫైర్ మీద ఉన్నారంట.
మరోవైపు మార్చి 14న జనసేనపార్టీ ఆవిర్భవం సభ.. పిఠాపురంలో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలకు.. నాదేండ్ల కౌంటర్ ఇచ్చిన కూడా.. అది అంతగా పేలలేదని.. పవన్ నోటి నుంచి కౌంటర్ వస్తే.. అది సుత్లీ బాంబులా ఉంటుందని జనసైనికులు చర్చించుకుంటున్నారంట.
మొత్తానికి ప్రస్తుతం అందరు కూడా.. పిఠాపురంలో జరగబోయే పార్టీ ఆవిర్భావ సభమీదనే ఎంతో నమ్మకం పెట్టుకుంటున్నారంట.. తమ అభిమాన నేత.. పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వాఖ్యలకు.. తమ నేత కౌంటర్ ఇస్తేనే తమ ఈగో సాటిసై ఫై అవుతుందని.. ఇదే జగన్ కామెంట్లకు.. కుక్కకాటుకు.. మా చెప్పుదెబ్బ.. అని జనసైనికులు తెగ చర్చలు చేసుకుంటున్నారంట.
Read more: Nara Lokesh: 'మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర అహంకారం'
మొత్తంగా ప్రస్తుతం పిఠాపురంలో జగన్ గతంలొ పవన్ కు డిపాజిట్ సైతం రాదని కామెంట్లు చేశారు. కానీ పవన్ మాత్రం.. రికార్డులు తిరగరాస్తు.. భారీ మెజార్టీతో గెలిచి అక్కడే.. జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతుడంటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









