Karumuri Nageshwar Rao: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీని అధినేత జగన్ పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ చాలామంది లీడర్లను తమ సొంత నియోజకవర్గాలకు తిరిగి పంపించేస్తున్నారు.. ఇటీవల మాజీమంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్ నుంచి తిరిగి చిలకలూరి పేట ఇంచార్జ్‌గా నియమించారు. ఆమెతో పాటు మాజీమంత్రి అంబటి రాంబాబుకు కూడా తిరిగి సొంత నియోజకవర్గం అప్పగించారు.. ఇప్పుడు మరో ఇద్దరు నేతలను కూడా తమ సొంత నియోజకవర్గాలను పంపించాలని జగన్ డిసైడ్ అయినట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది..
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీలో ముఖ్యమైన నేతలంతా ఓటమి పాలయ్యారు. ఇక పోలవరంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సొంత పార్టీ కార్యకర్తలే సహకరించలేదు.. ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ నేతలు అభ్యంతరం చెప్పడంతో టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. చివరకు తెల్లం బాలరాజు భార్య రాజ్యలక్ష్మికి వైఎస్ జగన్ టికెట్ ఇచ్చారు. దాంతో వైసీపీ అభ్యర్ధిగా తెల్లం రాజ్యలక్ష్మి బరిలో నిలిచారు. కానీ అక్కడ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. తాజాగా పార్టీలో నేతలను సొంత నియోజకవర్గాలకు పంపిస్తున్న నేపథ్యంలో రాజ్యలక్ష్మిని తప్పించి.. పోలవరం బాధ్యతలు తిరిగి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకే అప్పగిస్తారని పార్టీ నేతలు అంటున్నారు..
మరోవైపు ఏలూరు లోక్‌సభ ఇంచార్జ్‌ను మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా మాజీమంత్రి కారుమూరి నాగేశ్వర రావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ పోటీ చేశారు. కానీ అక్కడ కూటమి అభ్యర్ధి పుట్టా మహేష్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు తణుకు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీమంత్రి కారుమూరి నాగేశ్వర రావు సైతం ఓడిపోయారు. అయితే మాజీమంత్రి కారుమూరి ఓటమి సొంత పార్టీలోని ఓ వర్గమే కారణమని ఆ తర్వత నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలిందట. ఆ తర్వాత కూడా తణుకులోని ఆ వర్గం కారుమూరిపై బహిరంగంగానే విమర్శలకు దిగడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో తణుకులో మాజీమంత్రి కారుమూరిపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దాంతో అక్కడ కారుమూరి కొడుకు సునీల్ కుమార్‌కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కారుమూరి సునీల్‌కు తణుకు బాధ్యతలు అప్పగించడం ద్వారా కారుమూరి నాగేశ్వర రావును ఎక్కడికి మారుస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
మొత్తంగా పలు నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని వైసీసీ వర్గాలు అంటున్నాయి. పార్టీ ఓటమికి అభ్యర్ధుల మార్పులే ప్రధాన కారణంగా భావిస్తున్న జగన్ ఇకమీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఏలూరు జిల్లా ఇంచార్జ్ మార్పులపై మాత్రం త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తారని తాడేపల్లి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి..
Also Read: Dharmana Prasad Rao: ధర్మాన అస్త్రసన్యాసం.. కొడుకు జనసేనలోకి!
Also Read: TELANGANA BJP: ఆపరేషన్ తెలంగాణ.. బీజేపీ కొత్తప్లాన్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.