YS Jagan Fire: ఇవతల తంతే అవతల పడతారు.. చంద్రబాబుపై మాజీ సీఎం జగన్‌ విమర్శలు

YS Jagan Fire On Chandrababu In Kurnool Leaders Meeting: రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ పక్కన తంతే అవతల పడతారని పరోక్షంగా సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యానించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 10, 2025, 06:25 PM IST
YS Jagan Fire: ఇవతల తంతే అవతల పడతారు.. చంద్రబాబుపై మాజీ సీఎం జగన్‌ విమర్శలు

YS Jagan Mohan Reddy: వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతారని ఎన్డీయే కూటమిపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జోష్యం చెప్పారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని.. ప్రశ్నించే గొంతు ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తెలిపారు. అయితే చర్యకు ప్రతి చర్యకు తప్పక ఉంటుందని ఎన్డీయే ప్రభుత్వాన్ని జగన్‌ హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: WhatsApp Governance: వాట్సప్‌ గవర్నెన్స్‌లో వెయ్యి సేవలే లక్ష్యం.. 15 నుంచి కొత్త కార్యక్రమం

ఉమ్మడి కర్నూల్‌ జిల్లా వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిస్థితులు.. పార్టీ బలోపేతం.. స్థానిక సంస్థల ఎన్నికల అంశాలను నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా నాయకులకు ధైర్యం నూరిపోశారు. కష్టాలు ఎదుర్కొని తట్టుకుని నిలబడితే మళ్లీ అవకాశం లభిస్తుందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు.

Also Read: Mark Shankar Health: తన కొడుకు పరిస్థితి వివరించి భావోద్వేగానికి లోనైన పవన్ కల్యాణ్

'రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారు. పోలీసులను వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకున్నారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ దారుణాలకు పాల్పడుతోందని.. కానీ చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని చెప్పారు. 'తమిళనాడు తరహాలో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈపక్కన ప్రజలు తంతే ఆ పక్కన పడతారు' అని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు మరిన్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తాడని.. అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులు, శ్రేణులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచించారు.

'స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగితే సంఖ్యా బలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు అధికార అహంకారం చూశారు. పార్టీ శ్రేణులు, నాయకుల తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించాం. చంద్రబాబు వైఎస్సార్‌సీపీ కేడర్‌ను ఏమీ చేయలేకపోయాడు' అని చెబుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్ అభినందించారు. ఈ సందర్భంగా రామగిరిలో జరిగిన పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు టీడీపీకి అనుకూలంగా ఓటేయాలని బెదిరింపులకు పాల్పడ్డారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News