Hindupuram Attack news: బాలకృష్ణ ఇదా నీ రాజకీయం.!.హిందూపురం ఘటనపై వైసీపీ నేతలు సీరియస్.. వీడియో..

Hindupuram ysrcp followers fire on balakrishna: ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి తాము గాంధీలం కాదని వైసీపీ నేతలు మాట్లాడారు. హిందూపురంలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు చూడలేదన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 15, 2025, 10:16 PM IST
  • బాలయ్యపై హిందూపురం వైసీపీ నేతలు ఫైర్..
  • ప్రజలు ఒక్కసారిఆలోచించాలని వ్యాఖ్యలు..
Hindupuram Attack news: బాలకృష్ణ ఇదా నీ రాజకీయం.!.హిందూపురం ఘటనపై వైసీపీ నేతలు సీరియస్.. వీడియో..

Hindupuram ysrcp party office attack incident: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీ కార్యకర్తలు,  బాలకృష్ణ అభిమానులు హిందుపురంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ పై దాడిచేసి ఫర్నీచర్ అంతా ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన కార్యకర్తల్ని చితకబాదారు. మొత్తంగా పార్టీఆఫీస్ ను రణరంగంగా చేశారు.ఈ ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యంను అపహస్యం చేసే చర్యలంటూ కూటమి సర్కాను ఏకీపారేశారు. ఇలాంటి చర్యలతో వైసీపీ క్యాడర్ మనోస్థైర్యంను దెబ్బతీయలేరన్నారు.

Add Zee News as a Preferred Source

 

ముఖ్యంగా వైసీపీ ఆఫీస్ పైదాడి ఘటనను హిందూపురం వైసీపీ నేతలు , కార్యకర్తలు ఖండించారు.ఈ  ఘటనపై హిందూపురం వైసీపీ నేతలు మాట్లాడారు.  ఈ ఘటన హిందూపురంకు మాయని మచ్చగా అభివర్ణించారు.  మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే  బాలకృష్ణ చేసే రాజకీయాలు ఇవా.. అంటూ ఏకీపారేశారు.

 బాలకృష్ణ రిసాట్  లోకూర్చుని వారి కార్యకర్తల్ని తమపై ఉసిగొల్పారన్నారు. ముఖ్యంగా దాడిచేసిన వారంత బైటవాళ్లని స్పష్టం చేశారు. ఇది పిరికి పంద చర్య అని అన్నారు.  మరోవైపు..జగన్ 2.O మీఊహకే వదిలేస్తున్నామన్నారు. ఇటీవల మెడికల్ కాలేజీ ప్రైవేటికరణపై నిరసనల్లో.. జనాలు భారీగా వచ్చారని.. దీన్నిఓర్చుకోలేక ఈ విధంగా బాలయ్య దాడులు చేయించారని కూడా హిందూపురం వైసీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడారు.

Read more: YS Jagan Video: హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి.. బాలకృష్ణ, సీఎం చంద్రబాబులపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో..

మరోవైపు బాలయ్యను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కనీసం రోడ్లు, డ్రైనేజీ , వాటర్ సమస్యలు కూడా పూర్తిగా తీరలేవన్నారు. ఇప్పటికైన ప్రజలు ఆలోచించాలని వైసీపీ నేతలు కోరారు. మొత్తంగా హిందుపురం ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News