)
AP UREA Shortage: 'మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ రైతులకు యూరియా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?' అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 'రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు?' అని చంద్రబాబును నిలదీశారు. 'ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు చంద్రబాబు' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు.
ఏపీలో యూరియా కొరతపై 'ఎక్స్' వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 'యేటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి. ఎరువులు ఎంత పంపిణీ చేయాలనే దానిపై ప్రతిఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడంలేదనే కదా అర్థం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 'ప్రభుత్వం నుంచి కిందకు వెళ్లిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేసి, బస్తా యూరియా రేటు రూ.267లు అయితే, దీనికి మరో రూ.200లు అధికంగా అమ్ముకుంటున్నారు' అని ఆరోపించారు.
'పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చిత్తశుద్ధితో ఏరోజూ రైతును ఆదుకోలేదు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మేం ఏర్పాటు చేసిన ధరలస్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చుచేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. ఉచిత పంటలబీమాకు పాతరవేశారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
'ఏ సీజన్లో పంట నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్‌లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్(పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా, రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20వేలు, అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు' అని చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. అందుకే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అని మరోసారి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.