YS Jagan warning to ap cm Chandrababu naidu and ap police video: మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ పోలీసులపై మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాక ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ హమీలు ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం హమీలు అడిగితే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అపోసిషన్ పార్టీల గొంతునొక్కే కార్యక్రమాలను చంద్రబాబు సర్కారు చేస్తుందన్నారు. ఏపీ కూటమిని ప్రశ్నిస్తున్నందుకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా పోలీసులు అక్రమ కేసుల్ని పెడుతున్నారన్నారు.
ఇటీవల పోసాని కృష్ణ మురళి , నందిగామ సురేష్, వల్లభ నేని వంశీ, పిన్నేల్లి రామకృష్టారెడ్డి తదితరులపై పోలీసులు అక్రమంగా కేసుల్ని బనాయిస్తున్నారన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన హమీలను అడిగితే.. తమ మీద లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారన్నారు.ఈ క్రమంలో వైఎస్ జగన్ తాజాగా.. చంద్రబాబుపై, ఏపీ పోలీసులపై మరోసారి శివాలెత్తిపోయారు.
పోలీస్ అధికారులకు జగన్ వార్నింగ్
పోలీసులు చంద్రబాబుకు వాచ్మెన్ల లాగా ప్రవర్తిస్తున్నారు
మా ప్రభుత్వం వచ్చాక మీ ఉద్యోగాలు పీకేసి, బట్టలు ఊడదీసి కొడతాం – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి pic.twitter.com/plt1FNnFHV
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2025
అధికారం అదేది ఎవరికి శాశ్వతం కాదని అన్నారు. ఏపీ పోలీసులు తమ టోపీల మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయాలన్నారు. కానీ కొంత మంది పోలీసులు చంద్రబాబు మెప్పకోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. కానీ రాబోయేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
Read more: YS Jagan: పవన్ కళ్యాణ్ కుమారుడికి స్కూల్లో గాయాలు.. మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?
అప్పుడు ప్రతి ఒక్క పోలీసులకు మిత్తితో సహా చెల్లిస్తామన్నారు. అదే విధంగా బట్టలూడదీసి ప్రజల ముందు, న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. యూనిఫామ్ తీయించి.. ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటది అన్న చందంలా రాజకీయాలు మారిపోయాయి.
తమకు అపోసిషన్ పార్టీ హోదాను ఇవ్వాల్సిందేనని వైసీపీ నాయకులు పట్టుబడుతు , కూతమిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేవరకు ప్రభుత్వంను వదిలిపెట్టేదిలేదని వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో కూటమిపై విరుచుకు పడ్డారు.ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మరోసారి హట్ టాపిక్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









