YS Jagan: బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత) 105 సెక్షన్ అంటే.. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. జగన్ సహా ఆరుగురిపై ఈ సెక్షనే పెట్టారు. నేరం నిరూపిస్తే జీవిత ఖైదు విధించొచ్చు. నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలుంది. ఇది నాన్ బెయిల్‌బుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బీఎన్‌ఎస్ 49 సెక్షన్‌ను ఈ కేసులో చేర్చారు. తొలుత నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారంటూ బీఎన్‌ఎస్ 106(1) సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలన్నింటినీ విశ్లేషించటంతో.. ఇది కల్పబుల్ హోమీసైడేనని నిర్ధారణకు వచ్చి.. ఈ సెక్షన్ జత చేశారు.
తన పర్యటన సందర్భంగా జరిగినటువంటి ప్రమాదపు వ్యవహారంలో ఇప్పుడు జగన్ని A2 చేర్చారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఎవరి వాదన వాళ్లది. ఒకటి ఆ అక్కడ జగన్ వెహికల్ కిందన పడినటువంటి వ్యక్తిని తీసి పక్కనపెట్టేసి వెళ్లిపోయారన్నది ప్రభుత్వం పాయింట్. కానీ వైసీపీ వాళ్లు మాత్రం కారు కింద పడినటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ కూడా వచ్చింది. అంబులెన్స్ ఎక్కించాక అతన్ని
మళ్ళీ అంబులెన్స్ లో నుంచి దించేశారన్నది వాదన. ఆ తర్వాత మళ్ళీ ఆటోలో ఎక్కించేటటువంటిప్రయత్నం చేశారు. ఇది మరి ఎందుకు అలా చేశారన్నది ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. అక్కడ పోలీసులు కూడాఉన్నారు. మరి పోలీసులు ఉండగా ఎలా వదిలిపెట్టేసారనేది మిలియన్ డాలర్స్ గా ప్రశ్నగా మారింది. అసలు ఆ వ్యక్తికి సరైన సమయంలో చికిత్స చేసుంటే బతికే వాడేది వైసీపీ వర్గాల వారి వాదన.
కారు యాక్సిడెంట్ కు సంబంధించి నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. ఇక కావాలని చెప్పి ఎవరు ఎవరిని గుద్దేయరు. కారు కింద పడ్డప్పుడు వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్న ఒక నాయకుడికి అప్పచెప్పితీసుకెళ్ళమని జగన్ చెప్పి ఉంటే బాగుండేది. లేదా తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిని ఆ వ్యక్తికి అసైన్ చేసిన అతని చికిత్సకు కావాల్సిన అన్ని సదుపాయాలు దగ్గరుండి చేయమని ఫాలో అప్ చేయాల్సిన బాధ్యతను జగన్ మరిచారన్నది ఇక్కడ తేలిపోయింది. జగన్ తన కారు కింద ఓ కార్యకర్త పడ్డ విషయాన్ని అసలు పట్టించుకోలేదనే విషయం సీసీ ఫుటేజీతో అర్థమవుతోంది. అదే జగన్ కు మైనస్ గా మారింది. ముందు అంబులెన్స్ లో ఎక్కించి.. ఆ తర్వాత ఆ వ్యక్తిని ఎవరు దింపేశారు. మళ్లీ ఆటోలో ఎందుకు ఎక్కించారనేది ఎవరు సమాధానం చెప్పడం లేదు. యాక్సిడెంట్ గురైన కారును పోలీసులు సీజ్ చేసి జగన్ డ్రైవర్ వెంకట రమణా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జగన్ కాన్వాయ్ దగ్గరగా మనుషులు వెళ్లకుండా తగిన బందోబస్తు కల్పించాలి. ఇందులో పోలీసులు నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఓ నిండు ప్రాణం బలైపోయింది.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.