Ys Jagan mohan reddy critisized ap govt: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇటీవల పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. దీనిపై తాజాగా.. ఏపీ మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన ఆఫీసులో మీడియాలో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు సర్కారు ప్రవేష పెట్టిన బడ్జెట్ అంతా.. ఆత్మస్థుతి, పరనింద అనే రెండు అంశాలతో నిండిపోయిందన్నారు. పూర్తిగా తమ ప్రభుత్వమే అది చేసింది.. ఇది చేసిందని లేనీ పోనీ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ప్రతిదానికి మా ప్రభుత్వంపై దుమ్మేత్తి పోయడం కూటమి సర్కారుకు అలవాటు అయిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్న కూటమి ఎన్నికలలో ఇచ్చిన హమీలు మాత్రం ఇంకా నెరవేర్చేలేదన్నారు.
ఏకంగా గవర్నర్ చేత కూడా చేయని పనులు చేసినట్లు చెప్పించారన్నారు. చంద్రబాబు రాజకీయా జీవితానికి ఇంతకన్న సిగ్గు చేటు మరోకటి ఉందా అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మభ్య పెట్టి తమ ప్రభుత్వం కన్నా.. ప్రతి దాంట్లో ఎక్కువగా ప్రజలకు పథకాలు తీసుకొస్తామని చెప్పి, బాండ్ లు కూడా పంచి పెట్టారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం.. సూపర్ సిక్స్ ఏమైందంటే మాత్రం దానికి ఆన్సర్ లేదన్నారు.
పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ - ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి pic.twitter.com/B9Y9Hed9Ch
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2025
ఏమన్నా అంటే.. అపోసిషన్ నేతల మీద కేసులు పెట్టి వారి నోళ్లను మూయించే ప్రయత్నాలను అధికార పార్టీ చేస్తుందన్నారు. చంద్రబాబు ప్రతి మహిళకు.. 36వేలు బాకీ ఉన్నారన్నారు. 18సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు రూ.18వేలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలనెల ఫించన్ ఇస్తారన్నారు. అదే విధంగా.. రైతులను కూడా కూటమి ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. పీఎం కిసాన్ కు సంబంధం లేకుండా సంవత్సరానికి 20వేలు ఇస్తామని చెప్పి, రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 50 సంవత్సరాలు నిండిన మహిళలకు 45వేలు ఇస్తామని చెప్పి అదీ ఇవ్వలేదన్నారు.
ఇటీవల బడ్జేట్ నేపథ్యంలో ప్రవేశ పెట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో.. 2024 నుంచి 2025లో 27లక్షలకు పైనే ఉద్యోగాలు ఇచ్చేశామని ఏకంగా డాటాను పొందుపర్చారని విమర్శించారు. అదే విధంగా తమ సర్కారు గతంలో.. లక్ష30 వేల మందికి, గ్రామ వాలంటీర్లుగా రెండు లక్షలు, అప్కాస్ ద్వారా 90 వేల పైనే ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అదేవిధంగా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ అంటూ మళ్లీ జగన్ తనదైన స్టైల్ లో సెటైర్ లు వేశారు.
గతంలో పవన్ కళ్యాణ్ ఏపీలో జగన్ కు అపోసిషన్ హోదా గురించి మాట్లాడుతూ.. వారికి జర్మనీలో అపోసిషన్ హోదా వస్తుందని, ఏపీలో రాదని అన్నారు. దీనిపై తాజాగా.. వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని.. మొదటి సారి గెల్చినందుకు ఎగిరేగిరిపడుతున్నారని కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









