)
YS Jagan In Ganesh Chaturthi: ప్రతిసారి తనపై వస్తున్న విమర్శలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెక్ పెట్టారు. అన్యమతస్తుడైనా కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ వినాయక పూజలో కూర్చున్నారు. బొట్టు ధరించి.. మంత్రాలు చదివి వినిపించారు. ఇతర మతాలను ఎప్పుడూ గౌరవించే జగన్‌పై ఇటీవల దుష్ప్రచారం జరుగుతోంది. తిరుమల ఆలయాన్ని సందర్శిస్తున్నారని.. మళ్లీ డిక్లరేషన్ వివాదాన్ని తెరపైకి తీసుకురావడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ వినాయక చవితి ద్వారా తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి సమాధానం ఇచ్చారు.
వినాయకచవితి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గణనాథుడికి వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతోపాటు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. గణనాథుడి జరిగిన తొలి పూజా కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు చెప్పిన విధానం పాటించారు.
పూజలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఎలాంటి బేషజాలు లేకుండా పాల్గొన్నారు. అంతేకాకుండా అర్చకులు బొట్టు పెడితే తిరస్కరించకుండా పెట్టుకున్నారు. అలాగే వినాయకుడికి పూలు, అక్షితలు సమర్పించడమే కాకుండా కొబ్బరికాయలు కొట్టారు. మనసఃపూర్వకంగా వినాయకుడికి మాజీ సీఎం వైఎస్ జగన్ దండం పెట్టారు. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పూజలో ఆయన పాల్గొన్నారు.
వినాయక చవితి పూజలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, కల్పలత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నందిగం సురేష్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఆలూరి సాంబశివారెడ్డి, పోతిన వెంకట మహేష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, రాయన భాగ్యలక్ష్మి, అడపా శేషు, కొమ్మూరి కనకారావు, నారాయణమూర్తి, తంగిరాల రామిరెడ్డి సహా పార్టీ నేతలు హాజరయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.