YS Jagan: పవన్ కళ్యాణ్ కుమారుడికి స్కూల్లో గాయాలు.. మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?

Pawan kalyan son mark Shankar injured: సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ క్రమంలో అక్కడున్న స్కూల్ సిబ్బంది వెంటనే పవన్ చిన్న కుమారుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తాజాగా.. మాజీ సీఎం జగన్ స్పందించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 8, 2025, 01:36 PM IST
  • పవన్ కళ్యాన్ పై ట్విట్ చేసిన వైఎస్ జగన్..
  • మార్క్ శంకర్ తొందరగా కొలుకాలంటూ ప్రార్థనలు..
YS Jagan: పవన్ కళ్యాణ్ కుమారుడికి స్కూల్లో గాయాలు.. మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?

YS Jagan tweet on pawan kalyan son injured incident: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజీనోవా తన కుమారుడుతో కలిసి సింగపూర్ లో ఉంటున్నారు. మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూళ్లో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా స్కూల్ భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమైన విద్యార్థుల్ని కాపాడారు. స్కూల్ బిల్డింగ్ అంతా పొగలు వ్యాపించాయి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంటలో చిక్కుకున్నారు. మంటల కారణంగా అతని కాళ్లు, చేతులు తీవ్రంగా బొబ్బలు వచ్చాయి. అయితే.. అక్కడున్న సిబ్బంది వెంటనే పిల్లలను కాపాడి ఆస్పత్రికి తరలించారు.

Add Zee News as a Preferred Source

 సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళారం ఉదయం 9. 45 గంటలకు , రెండు, మూడు అంతస్తులలో మంటలు 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారు. వెంటనే పిల్లలందరిని సిబ్బంది కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . ఊపిరి తిత్తుల్లోకి పొగవెళ్లిందని వైద్యులు తెలిపారు. అయితే.. భయపడాల్సిన అవసరంలేదని కూడా వైద్యులు స్పష్టం చేశారు. అయితే.. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డవిషయంపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.

ఈ ఘటనపై జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పవన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ తొందరగా కొలుకొవాలని కూడా ఆదేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ క్లిష్టపరిస్థితుల్లోతాము అన్ని విధాలుగా పవన్ కు అండగా ఉంటామని కూడా జగన్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాజకీయాల పరంగా ఒకరికి మరోకరు పడక పోయిన కూడా.. ఏదైన కష్టాలు వచ్చినప్పుడు తాము అండగా ఉంటామని.. అవతలి వారికి మంచి జరగాలని జగన్ ట్విట్ చేయంపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more: Mark Shankar: స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కొడుకు మార్క్‌ శంకర్‌..

ప్రస్తుతం నెటిజన్లు వైఎస్ జగన్ చేసిన పనిని కొనియాడుతున్నారు.అదే విధంగా పవన్ కొడుకు తొందరగా కోలుకొవాలని నెటిజన్లు, జనసేన అభిమానులు ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.  అయితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలోని  అల్లురీ సీతారామారాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ ఘటన తెలియగానే అందరు సింగపూర్ కు వెళ్లిపోతారని భావించారు. కానీ పవన్ మాత్రం ముందుగా ఇచ్చిన మాట ప్రకారం గిరిజనుల్ని కలిశాక..ఇక్కడి కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న తర్వాత సింగపూర్ వెళ్తారని అధికారులు వెల్లడించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News