Pastor Praveen Pagdala Death: ఆంధ్రప్రదేశ్‌లో మత ప్రబోధకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రమాదం కాదు హత్య అని ఆరోపణలు వస్తున్నాయి. అతడిని కొందరు కక్షగట్టి చంపేశారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు చేయాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
Also Read: Free Parking: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మాల్స్, మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫ్రీ.. ఫ్రీ
ఏపీలో రచ్చ రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. మత ప్రబోధకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణకు డిమాండ్ చేశారు.
Also Read: Tax Payers: పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. 50 శాతం భారీ డిస్కౌంట్!
పాస్టర్, మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. ప్రవీణ్ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తుండడంతో దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుటుంబసభ్యులకు మాజీ సీఎం వైఎస్ జగన్‌తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ హత్య అని ఆరోపణలు వస్తుండడంతో దీనిపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి నిజనిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ మరణం ప్రమాదంలో జరిగింది కాదని.. పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
26.03.2025
తాడేపల్లిమత ప్రభోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan తీవ్ర విచారం ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో విచారణకు డిమాండ్
పాస్టర్, మత ప్రభోదకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ…
— YSR Congress Party (@YSRCParty) March 26, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.