YS Jagan In Tenali: '24 కేసులు ఉన్న సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై కొడితే ధర్మమేనా?': వైఎస్‌ జగన్‌

YS Jagan Meets Tenali Police Attack Victim Family In Ithanagar: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ధర్మం కాదు కదా? నడిరోడ్డుపై కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 3, 2025, 07:09 PM IST
YS Jagan In Tenali: '24 కేసులు ఉన్న సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై కొడితే ధర్మమేనా?': వైఎస్‌ జగన్‌

Tenali Police Attack: యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని.. ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారుతోందని.. ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని ప్రకటించారు. పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ధర్మం కాదు కదా? అని ప్రశ్నించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు జాక్‌పాట్.. అక్కడ జనసేనకు తొలి విజయం

గుంటూరు జిల్లా తెనాలి, ఐతానగర్‌ యువకులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయగా.. ఆ బాధితుడిని మంగళవారం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. 'మాజీ మంత్రులు, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు. దారుణంగా దిగజారిన పోలీసు వ్యవస్థతో పూర్తిగా పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

'ఆ యువకులపై ఉన్న పాత కేసులకు.. పోలీసుల దాడికి ఏం సంబంధం? నేను ఆ యువకులను వెనకేసుకు రావడం లేదు' అని స్పష్టం చేశారు. 'వారిని అలా బహిరంగంగా హింసించడం ఎందుకు కేసుల వ్యవహారాన్ని కోర్టులు చూసుకుంటాయి కదా? పోలీసులు వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఎలా కొడతారు? పోలీసులు చట్టాన్ని అలా ఎలా ఉల్లంఘిస్తారు?' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. 'ఆ కుటుంబాల్లో మంచి విద్యావంతులున్నారు. ఆ యువకులూ చదువుకున్న వారే. వారికి పెళ్లి కావాల్సిన చెల్లెళ్లూ ఉన్నారు. పోలీసుల చర్య వల్ల ఆ కుటుంబాలకు అప్రతిష్ట. ఓ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగిస్తారా? ఇప్పుడు ఆ కుటుంబాల పరువు ఎవరు తీసుకొస్తారు? పోలీసుల తీరు దారుణం. పూర్తిగా అసమంజసం' అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: BMW Car: తినడానికి తిండీ లేదంటే.. 'బీఎండబ్ల్యూ' కారు కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అదుపు తప్పిపోతే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుందని చెప్పడానికి నిదర్శనం తెనాలి ఘటన నిదర్శనం. ప్రతి సంఘటనలో చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులను నొక్కేందుకు చంద్రబాబు దగ్గరుండి మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతోపాటు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారు' అని వివరించారు. జైళ్లకు పంపడంతో పాటు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారిందనడానికి ప్రస్తుతం అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం కళ్లెదుటే కనిపిస్తున్న సత్యం అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

'కేసుల మీద అంతిమంగా తేల్చాల్సింది కోర్టులు. కోర్టులకున్న అధికారాన్ని పోలీసులు తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతున్నా? పోలీసులే అభాండాలు వేస్తారు. పోలీసులే జడ్జిమెంట్లు ఇస్తారు. ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా?' అని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 'చంద్రబాబు మీద ఏకంగా 24 కేసులు ఉన్నాయి. అలా అని ఆయన్ను కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొడతారా? అదే చేస్తే అది ధర్మమేనా' అని నిలదీశారు.

'పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ సాక్షాత్తూ కొందరు డీఎస్సీలు, సీఐలు, ఎస్సైలను కలెక్షన్‌ ఏజెంట్లుగా వాడుకుంటోంది. మద్యం విక్రయాలు, ఇసుక, మట్టి, పేకాట క్లబ్బుల వరకు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తున్నారు. పోలీసులు వాటికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వసూలు చేసి.. పోలీసులకింత, ఎమ్మెల్యేకి ఇంత, చంద్రబాబుకి ఇంత, లోకేష్‌కి ఇంత అని పంపకాలు చేస్తున్నారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అనేది ఉందా? అని ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News