YS Jagan Iftar Party: పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసింది. ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ముస్లింలకు పండ్లు తినిపించి ఉపవాసాన్ని ముస్లింలు విరమించారు. ఈ సందర్భంగా ముస్లింలకు వైఎస్సార్‌సీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముస్లింలను పలకరించి వారికి శుభాకాంక్షలు చెప్పారు.
Also Read: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. విచారణ చేయాలని డిమాండ్
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్ధనలు సఫలం కావాలని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు.
Also Read: Papavinasanam Dam: పాపవినాశనం డ్యాంలో బోటింగ్‌పై టీటీడీ మాజీ చైర్మన్ ఆగ్రహం
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టోపీ, కండువా ధరించి నమాజ్ చేశారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించి ముస్లింతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ముందుగా ముస్లింలకు ఖర్జూర పండు తినిపించి ఉపవాస దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా జగన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









