YS Jagan's peddamma Susheelamma passes away: వైసీసీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జగన్ పెద్దమ్మ సులశీలమ్మ మరణించారు. ఆమె కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. సుశీలమ్మ వయస్సు 85ఏళ్లు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆమె కొంతకాలంగా ఇబ్బందిపడుతున్నారు. వైఎస్ జగన్ రెండు నెలల క్రితమే పులివెందులలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుశీలమ్మను పరామర్శించారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నయ్య ఆనంద్ రెడ్డి సతీమణి సుశీలమ్మ. ఆనంద్ రెడ్డి గతంలో మరణించారు.
సుశీలమ్మ అంత్యక్రియలను నేడు పులివెందులలోనే నిర్వహించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ కూడా హాజరువుతున్నారు. నేడు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్లనున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లారు. బెంగళూరు నుంచి నేరుగా పులివెందుల వెళ్లి అకాల వర్షాలతో నష్టపోయిన అరటి రైతలను ఆయన పరామర్శించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి విజయవాడలో జరిగిన ఇఫ్తార్ పార్టీలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ నేడు జగన్ పులివెందులకు బయలుదేరారు.
Also Read: Kamindu Mendis SRH 2025: దటీజ్ కమిందు.. రెండు చేతుల్తో ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడం అతనికే సాధ్యం
కాగా ఈ మధ్య కాలంలోనే జగన్ కుటుంబంలో మరో విషాదం జరిగింది. గత ఏడాది చివరిలో వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి మరణించారు. అభిషేక్ రెడ్డి డాక్టర్. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. జగన్ బాబాయి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి కూడా మరణించారు. బాపట్ల జిల్లా మేదరమెట్లో పిచ్చమ్మ బౌతిక కాయానికి జగన్ నివాళులర్పించారు. వైఎస్ జగన్ ఫ్యామిలీలో వరుసా విషాదాలు నెలకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









