YS Sharmila: 'మోదీ, బాబు, జగన్, పవన్‌ కలిసి ఏపీకి తీరని ద్రోహం': వైఎస్‌ షర్మిల

YS Sharmila Worry About Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారిన పోలవరం ప్రాజెక్టును నలుగురు కలిసి చంపేశారని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. పోలవరం ఎత్తు పెంచాలని.. ప్రజలను మోసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 4, 2025, 11:10 PM IST
YS Sharmila: 'మోదీ, బాబు, జగన్, పవన్‌ కలిసి ఏపీకి తీరని ద్రోహం': వైఎస్‌ షర్మిల

Polavaram Project: దశాబ్దాలు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతోపాటు చంద్రబాబు చేస్తున్న రాజకీయాలపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసి ఇప్పుడు దానిని ప్రమాదంలోకి నెట్టేశారని ఆరోపించారు. బీజేపీతో జత కట్టి చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును యథావిధిగా నిర్మించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: YS Sharmila: 'వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి జైలులో ఉండాలా? బయట ఉండాలా?'

'41.15 మీటర్ల ఎత్తులో పోలవరం అంటే అది ప్రాజెక్ట్ కాదు. పోలవరం ఇక బ్యారేజ్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా మారే ప్రమాదం. 41.15 మీటర్ల ఎత్తులో జరిగే ప్రయోజనం ఏంటో శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు చెప్పాలి' వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. 'ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఎగ్గొట్టేందుకు ఎత్తు తగ్గించి ప్రజలను మభ్య పెడుతున్నారు. 85 వేల కుటుంబాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తు తగ్గించారు. దాదాపు రూ.22 వేల కోట్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ దెబ్బతీసింది' అని ఆరోపణలు చేశారు.

Also Read: YS Sharmila: ముస్లింలకు చంద్రబాబు ఇఫ్తార్ విందులో విషం పెట్టినట్లే: వైఎస్‌ షర్మిల

విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ షర్మిల ఏపీ పరిణామాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ఇలా నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. పోలవరంపై స్పందిస్తూ.. 'చేతులు జోడించి అడుగుతున్నాం... ప్రాజెక్ట్ నిర్మాణం 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించండి' అని వైఎస్‌ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోసం చేయరాదని కోరారు. 'బీజేపీ పచ్చి మోసం చేస్తుంటే రాష్ట్ర ఎంపీలకు నిలదీసే దమ్ము లేదు. వైఎస్‌ జగన్ తప్పు చేశాడు.. మీరు కరెక్ట్ చేయండి. మీరు కూడా అదే తప్పును కొనసాగిస్తారా?' అని నిలదీశారు. ఆనాడు మోడీ వచ్చి మట్టి కొట్టారు.. ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారు అని మండిపడ్డారు.

'రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. బీజేపీ పదేళ్లు మోసం చేస్తోంది. 2014లో ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామన్నారు. పోలవరం మొత్తం కేంద్రమే కడుతుందని చెప్పారు. ఇచ్చిన హామీలు ఒక్కదానికి దిక్కులేదు' అని గుర్తుచేశారు. 'పోలవరం ఆంధ్ర జీవనాడి. రైతులకు ఊపిరి. ఈరోజు వరకు ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దీనికి భాధ్యత ఎవరు?' అని షర్మిల ప్రశ్నించారు.

'పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్‌ కల. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అన్ని అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. ఇప్పుడు పోలవరం ఎత్తు 41 మీటర్లకు కుదించారు. ఇలా కడితే అది పోలవరం కాదు. పోలవరం జీవనాడీ అవ్వదు' అని తెలిపారు. చంద్రబాబు, జగన్ అధికారంలో వచ్చాక పోలవరం పనులు వేగంగా జరగలేదు. పదేళ్లలో 50 శాతం పనులు దాటలేదు. ఇప్పుడు బీజేపీ పోలవరంపై గేమ్ ఆడుతుంది. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్‌కి ద్రోహం చేస్తున్నారు' అని షర్మిల ఆరోపించారు. అందరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం మార్చేశారని మండిపడ్డారు. జగన్, బాబు ఇద్దరు బీజేపీకి లొంగిపోయారని విమర్శించారు. 'ఇది రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న కుట్ర. ఈ కుట్రలో భాగం బాబు, జగన్, పవన్. చాలా తెలివిగా ప్రజలను మోసం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ యధావిధిగా ఉండాలని చేతులు జోడించి అడుగుతున్నాం' అని వైఎస్‌ షర్మిల విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News