YS Sharmila: 'రేవంత్ రెడ్డిని చూసి ఏపీ సీఎం చంద్రబాబు నేర్చుకోవాలి'

YS Sharmila Demands Caste Census In Andhra Pradesh: కుల గణన చేపట్టిన రేవంత్‌ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని వైఎస్‌ షర్మిల సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కుల గణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఉచ్చులో పడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 4, 2025, 05:33 PM IST
YS Sharmila: 'రేవంత్ రెడ్డిని చూసి ఏపీ సీఎం చంద్రబాబు నేర్చుకోవాలి'

Andhra Pradesh Caste Census: తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం. ఇదో చారిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీనవర్గాల ప్రజలే ఉండడం విస్మయపరిచిన అంశం అని వెల్లడించారు.

Add Zee News as a Preferred Source

Also Read: KT Rama Rao: 'కుల గణన సర్వే తప్పుల తడక.. పదేండ్ల తర్వాత బీసీ జనాభా ఎలా తగ్గింది?'

ఏపీలో కూడా కులగణన అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్‌ షర్మిల డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కులగణన చేపట్టాలని కోరారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని విజ్ఞప్తి చేశారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలన్నారు. 'మనమెంతో మనకంతా అన్నట్లుగా రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాల్లో వారి వాటా వారికి దక్కాలి. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలి' అని ఆకాంక్షించారు.

Also Read: Caste Census: తెలంగాణలో కుల గణన లెక్కలు ఇవే! గందరగోళపరుస్తున్న గణాంకాలు

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా బీజేపీ దత్తపుత్రుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని వైఎస్‌ షర్మిల విమర్శించారు. బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని ఆరోపించారు. బీజేపీ దర్శకత్వంలోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పు దారి పట్టిస్తోందని తెలిపారు. బీజేపీ ఉచ్చులో చంద్రబాబు పడవద్దని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని వైఎస్‌ షర్మిల డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News