YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్ షర్మిల ప్రశ్నలు ఇవే!
YS Sharmila Demands Free Bus Scheme: అధికారంలోకి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయకపోవడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను నిలదీశారు.
AP Free Bus Scheme: మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలయాపన తప్ప ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదు అని మండిపడ్డారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు.. పబ్బాలు పేరు చెప్పి దాటవేశారని గుర్తుచేశారు. బస్సులు కొంటున్నామని చెప్పి.. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని వివరించారు.
Also Read: Chandrababu: కబ్జారాయుళ్లకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. కబ్జా చేస్తే జైలుకే!
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉచిత బస్సు పథకం ప్రారంభించకపోవడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. 'ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు? చిన్న పథకం అమలుకు కొండత కసరత్తు దేనికోసం?' అని నిలదీశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా?' అని గుర్తుచేశారు. 'ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారు కదా?' అని షర్మిల వివరించారు.
Also Read: YS Jagan: అమిత్ షా అంబేడ్కర్ వ్యాఖ్యలకు వైఎస్ జగన్ మద్దతు.. వైసీపీ సంచలన ట్వీట్
జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీశారు. మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా? అని ప్రశ్నించారు. ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? అని అడిగారు. కనీసం నూతన సంవత్సర కానుక కిందైనా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని.. మీ చిత్తశుద్ది నిరూపించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook