చంద్రబాబు డైరక్షన్ లో పవన్ యాక్టింగ్ అదుర్స్ - షర్మిల సెటైర్లు

                                    

Last Updated : Mar 25, 2019, 12:55 PM IST
చంద్రబాబు డైరక్షన్ లో పవన్ యాక్టింగ్ అదుర్స్ - షర్మిల సెటైర్లు

మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పై దర్శనమించిన వైఎస్ షర్మిల.. ఇటు చంద్రబాబును అటు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ పవన్ పేరు ప్రస్తావిస్తూ ఆయన ఒక యాక్టర్ అని.. యాక్టర్ ఏం చేస్తాడు.. డైరక్టర్ చెప్పినట్లుగా నడుచుకుంటాడు.. డైరక్టర్ చంద్రబాబు చెప్పినట్లే  యాక్టర్ పవన్ కల్యాణ్ పొలిటికల్ స్క్రీన్ పై అద్భుతంగా నటిస్తున్నారని షర్మిల ఎద్దేవ చేశారు

సామాన్య ప్రజల డేటా చోరీకి పాల్పడిన చంద్రబాబును పవన్ ఎందుకు స్పందించలేదని షర్మిల ప్రశ్నించారు. వివేకనందరెడ్డి హత్య విషయంలో సీబీఐ ఎంక్వైజీ వైసీపీ డిమాండ్ చేస్తుంటే జనసేన  ఎందుకు సన్పందిండం లేదని ప్రశ్నించారు. బయటికి పొత్తు లేదంటూనే.. లోపల టీడీపీ - జనసేన పార్టీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. పవన్ కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేనినట్లేని షర్మిల వ్యాఖ్యానించారు

Trending News