)
YS Sharmila vs TTD Temples: దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్రూమ్ ఉందని హైకోర్టు పేర్కొంటే దానిపై దృష్టి పెట్టాలని మేము అడగడం తప్పా? అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కనీసం రోడ్లు, డ్రైనేజీ కూడా ఎస్సీ, ఎస్టీ కాలనీలలో లేవని ప్రశ్నించడం మేము చేసిన నేరమా? అని నిలదీశారు. దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా బడులు, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా? సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుండడంతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'తన నిధులతో టీటీడీ స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండదు. మేము లేవనెత్తిన సమస్యల్లా టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం ఏమిటి? ఒక మతానికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. తాను ప్రకటించే నిర్ణయాలు అన్ని మతాలకు సమానంగా ఉండాలి. కూటమి ప్రభుత్వంలో బీజేపీతో కలిసున్న సీఎం మిగతా మతాలకు అభద్రతాభావం కలిగించకూడదు' అని చంద్రబాబుకు షర్మిల హితవు పలికారు.
'మేమేదో హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకులమని చూపించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై, వ్యక్తిగతంగా నాపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ఛాందస వాదులు విష ప్రచారం చేస్తున్నారు' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. హిందువులను కావాలని రెచ్చగొడుతున్నారని.. పీఠాధిపతులతో తిట్టిస్తున్నారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ఉద్దేశాన్ని మత పిచ్చి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాదులు ఆపాదిస్తున్నారని.. మత రాజకీయాలు చేసి లబ్ది పొందేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న నీచ రాజకీయాలు ఇవి' అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
'హిందూ ధర్మానికి, మతానికి, నేను, కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం' అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లమని.. ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం ఇది కాదు కాంగ్రెస్ సిద్ధాంతం అని ప్రకటించారు. 'తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే.. భక్తుల మనోభావాలు దెబ్బతీశారని.. ఇది ఘోర అపచారం అని, వెంటనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని మొదట డిమాండ్ చేసింది నేనే' అని వైఎస్ షర్మిల గుర్తుచేసుకున్నారు.
'ప్రజల పక్షాన మా డిమాండ్‌లో మంచిని వెతకకుండా.. దానికి చంద్రబాబు సమాధానం చెప్పకుండా కుహనా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటు. ప్రజల కోసం మేము మాట్లాడితే మతం కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ మాట్లాడుతుంది . ఎవరు మత పిచ్చిగాల్లో, ఎవరు మత విద్రోహులో, విషం చిమ్మేది ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. టీటీడీని గుంజడం కాదు .. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వపరంగా సమాధానం ఇవ్వండి' అని చంద్రబాబును వైఎస్ షర్మిల సవాల్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook