YS Vivekananda Reddy Case: 'బెయిల్‌పై బయట ఉన్న ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తున్నారు' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి సాక్ష్యాలను మార్చివేస్తున్నారని చెప్పారు. దర్యాప్తు అధికారిని బెదిరించి తప్పుడు రిపోర్ట్ రాయించారని ఆరోపించారు. ఇంటికి పిలిపించుకుని తప్పుడు రాతలు రాయించి అదే నివేదికను సమర్పించారని తెలిపారు.
Also Read: Paritala Sunitha: పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్ పాత్ర కూడా ఉంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడా కనిపించడం లేదనే ప్రశ్నకు 'నేను కనిపించడం లేదు అనేది అవాస్తవం. మెడికల్ లీవ్ అనుకోవచ్చు కదా' అని తెలిపారు. శైలజానాథ్ పార్టీ మార్పుపై స్పందిస్తూ 'ఏముంది అని ఆయన వైసీపీకి వెళ్లాడో తెలియదు' అని పేర్కొన్నారు. 'అక్కడ (వైసీపీ) అధికారం లేదు డబ్బు మాత్రమే ఉంది. ఆ డబ్బు కోసమే పోయి ఉండొచ్చు' అని చెప్పారు. 'వైసీపీ మా మీద ఫోకస్ పెట్టింది అంటే కాంగ్రెస్ బలోపేతమైనదని అర్థం. మా నాయకులను లాగుతున్నారు అంటే మాకు భయపడుతున్నారు అని అర్థం. నా కృషి ఫలించింది అని అర్ధం' అని పేర్కొన్నారు.
Also Read: YS Sharmila: ముస్లింలకు చంద్రబాబు ఇఫ్తార్ విందులో విషం పెట్టినట్లే: వైఎస్ షర్మిల
వైఎస్ అవినాశ్ రెడ్డిపై స్పందిస్తూ.. 'బెయిల్ పై బయట ఉండి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తే వైఎస్ వివేకా కేసులో ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది? సునీత ప్రాణాలకు రక్షణ ఏది?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సునీతకు నేను ఆ రోజే చెప్పాను. నాన్నకు నువ్వు ఒక్కదానివే న్యాయం కోసం కోట్లాడాలి అని చెప్పా. నేను, సునీత పక్కన నిలబడతానని హామీ ఇచ్చా. ఎదుర్కొనేది ఎంత పెద్ద వాళ్లు అని తెలిసి కూడా నిలబడ్డా. ఆ రోజు నుంచి ఇప్పటివరకు సునీతకు న్యాయం కోసం నిలబడ్డా' అని వైఎస్ షర్మిల తెలిపారు.
'విచారణ అధికారిని అవినాశ్ ఇంటికి పిలిపించుకున్నాడు. అక్కడ బెదిరించి.. ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారు. సంతకం పెట్టించి రిపోర్ట్ ఫైల్ చేశారు' అని షర్మిల ఆరోపించారు. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అంటే అవినాశ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని చెప్పారు. బెయిల్ మీద బయట ఉండడంతోనే స్వేచ్ఛగా సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. 'సునీతనే వివేకాను హత్య చేయించింది అని కొత్త రిపోర్ట్ రాయించారు.. అధికారితో సంతకం పెట్టించారు' అని తెలిపారు.
'బెయిల్ మీద ఉన్న వాళ్లు సాక్ష్యాలు తారుమారు చేస్తే ఇక వాళ్లు బయట ఉండాలా? జైలులో ఉండాలా?' అని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. 'హత్య జరిగిన సమయంలో సునీత తన భర్త అక్కడ లేరు. అవినాశ్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. రక్తపు మరకలు అన్ని తుడిపించాడు. అన్ని సాక్ష్యాలు అవినాష్ రెడ్డి చేయించాడని ఉన్నాయి. అన్ని సాక్ష్యాలు ఉన్నా అవినాశ్ రెడ్డి తప్పు చేయలేదు అని నివేదికలు రాయిస్తున్నారు' అని షర్మిల వివరించారు. 'ఇలా అయితే న్యాయం ఎక్కడ జరుగుతుంది? సునీతకు ఎప్పుడూ న్యాయం జరగాలి? సునీత ప్రాణాలకు భద్రత ఉందా?' అని షర్మిల ప్రశ్నలు సంధించారు.
ఇటీవల సంచలనం సృష్టించిన క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అంశంపై కూడా వైఎస్ షర్మిల స్పందించారు. 'ప్రవీణ్ పగడాల కేసులో పోలీసులు వీడియోలు బయట పెడుతున్నారు. కుటుంబసభ్యులు న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇది బీజేపీ కుట్ర అని నాకు అనిపిస్తోంది' అని షర్మిల ఆరోపించారు. 'ఇక్కడ కూడా మతాల మధ్య విభజన తేవాలని చూస్తోంది. మతాల మధ్య విభజన చూడడం సరికాదని.. ఆంధ్రలో ఇంకా అటువంటి సంస్కృతి రాలేదని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









