YS Sharmila: కొత్త సీసాలో పాత సారా మాదిరి ఏపీ గవర్నర్‌ ప్రసంగం.. మారని మాజీ సీఎం జగన్ తీరు

YS Sharmila Reaction About Governor Budget Speech: అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌ ప్రవేశపెడుతుండగా.. గవర్నర్‌ కీలక ప్రసంగం చేశారు. అయితే ఈ ప్రసంగాన్ని వైఎస్‌ షర్మిల తప్పుబట్టారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 24, 2025, 10:18 PM IST
YS Sharmila: కొత్త సీసాలో పాత సారా మాదిరి ఏపీ గవర్నర్‌ ప్రసంగం.. మారని మాజీ సీఎం జగన్ తీరు

YS Sharmila: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సమయంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేయగా.. దానిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలపగా.. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ పెదవి విరించింది. గవర్నర్‌ ప్రసంగంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: GV Reddy Resign: టీడీపీకి ఊహించని షాక్.. జీవీ రెడ్డి రాజీనామా

అమరావతిలోని అసెంబ్లీ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగంపై వైఎస్‌ షర్మిల ఎక్స్‌ వేదికగా స్పందించారు. 'గవర్నర్ ప్రసంగంలో పసలేదు. దిశానిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు' అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదని పేర్కొన్నారు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదని తెలిపారు. 'మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. చంద్రబాబు విజన్ 2047కి దమ్ము లేదు' అని విమర్శించారు.

Also Read: Child Politics In AP: చిన్నారిపై పార్టీల నీచపు రాజకీయం.. ఏపీలో దిగజారిన విలువలు

'8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిట్‌మెంట్ కనిపించలేదు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చింది' ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడొచ్చాయి? అని నిలదీశారు. 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారు? అని షర్మిల ప్రశ్నించారు. 'తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? ఆరోగ్య శ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లించారు?' అంటూ షర్మిల ప్రశ్నలు సంధించారు. 'కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటి లేవు' అని గవర్నర్‌ ప్రసంగాన్ని షర్మిల తప్పుబట్టారు.

ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కూడా వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇక జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మాత్రం మారలేదు' అని అసహనం వ్యక్తం చేశారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది? అని నిలదీశౄరు. 'ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా?' అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని వైఎస్సార్‌సీపీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని షర్మిల సవాల్‌ చేశారు. సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని వైఎస్‌ షర్మిల మరోసారి డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News