
Chandrababu One Year Rule: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది గడిచినా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాపేనా అంటూ ప్రశ్నించారు. ఏడాది గడిచినా హామీలు అమలు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. ఏడాది కాలం పాటు ప్రజలను చంద్రబాబు చేసింది మోసమే అని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఎందుకు చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు ఏడాది పాలన అంతా మళ్లీ 3డీ గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేశారు.
'చంద్రబాబు సీఎంగా బాధ్యత చేపట్టి రేపటికి ఏడాది అవుతోంది. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి సూపర్ సిక్స్ అంటూ ఊదర గొట్టారు. అధికారం ఇస్తే అమలు చేస్తానని నమ్మించారు. కానీ చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసం' అని వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా? అని చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
'3 వేల నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ? ఎంతమందికి భృతి ఇచ్చారు?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని.. రైతులను ఆదుకునేది తామేనని చెప్పి ఏడాదిలో అన్నదాత సుఖీభవ ఒక్క రైతుకైనా ఇచ్చారా?' అని షర్మిల నిలదీశారు. రైతు భరోసా అని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 'స్కూల్ పిల్లలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని చెప్పి ఒక ఏడాది రూ.15 వేలు ఎగ్గొట్టారు' అని గుర్తుచేశారు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా ఇవ్వలేదని చెప్పారు.
'ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని రూ.15 వేలు ఇచ్చే హామీ ఏమైంది. ప్రతి మహిళలకు మహిళా శక్తి కింద నెలకు రూ.1,500, ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పి మహిళలను ఒక శక్తిగా చేస్తా అని చెప్పిన హామీ ఏమైంది' అని వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి మీకు మనసు ఎందుకు రాలేదని నిలదీశారు. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఒక పథకాన్ని అమలు చేసి చేయనట్లు చేశారని విమర్శించారు. సూపర్ సిక్స్ కాకుండా మిగతా హామీలకు దిక్కులేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కరెంట్ ఛార్జీలు రెండుసార్లు పెంచి రూ.17 వేల కోట్ల భారం వేశారు. చంద్రబాబు ఏడాది పాలన మొత్తం 3డీ గ్రాఫిక్స్' అని విమర్శించారు. మీకు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? రేపు ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook