YS Sharmila: ముస్లింలకు చంద్రబాబు ఇఫ్తార్ విందులో విషం పెట్టినట్లే: వైఎస్‌ షర్మిల

YS Sharmila Slams To Chandrababu: వక్ఫ్‌ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్‌ షర్మిల విరుచుకుపడ్డారు. ఎలా బిల్లుకు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 3, 2025, 10:16 PM IST
YS Sharmila: ముస్లింలకు చంద్రబాబు ఇఫ్తార్ విందులో విషం పెట్టినట్లే: వైఎస్‌ షర్మిల

Waqf Bill In Parliament: వక్ఫ్‌ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇచ్చారంటే ముస్లింలకు వెన్నుపోటు పొడిచినట్టేనని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఇఫ్తార్ విందు ఇచ్చి అందులో విషం పెట్టినట్లే లెక్క అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణలు తెచ్చి బీజేపీ మళ్లీ పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వ్యాఖ్యానించారు. 'ఇది ముస్లిం కమ్యూనిటీ మీద, దేశ ఐక్యత మీద, రాజ్యాంగం మీద జరిగిన దాడి'గా అభివర్ణించారు. బీజేపీ క్రూరత్వానికి నిదర్శనమని తెలిపారు. వక్ఫ్ బిల్లు సవరణలు ముస్లింలకు మేలు చేసేవి కావని స్పష్టం చేశారు. ముస్లింలకు తీరని అన్యాయమని చెప్పారు.

Add Zee News as a Preferred Source

Also Read: Paritala Sunitha: పరిటాల రవి హత్యలో వైఎస్‌ జగన్‌ పాత్ర కూడా ఉంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్‌ బిల్లుపై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్‌ భూముల అంశంలో అసలు సమస్యే లేదు. అంతా సక్రమంగానే ఉంది. ఇది వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్ర' అని ఆరోపించారు. బీజేపీది మతం పేరుతో చిచ్చుపెట్టే రాజకీయమని విమర్శించారు. మతం, కులం పేరు చెప్పి బీజేపీ విభజన చేస్తోందని మండిపడ్డారు. మతాలను విడగొట్టి ఓటు రాజకీయాలు చేయాలని చూస్తోంది. మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని బీజేపీ చూస్తోంది' అని షర్మిల విమర్శించారు.

Also Read: YS Jagan: ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.. బాబు, పాలనలో రక్షణ కరువు

ఈ సందర్భంగా చంద్రబాబు లక్ష్యంగా షర్మిల ప్రశ్నలు సంధించారు. చంద్రబాబుకు ముస్లింలు ఓటు వేయలేదా అని సూటింగా ప్రశ్నించారు. ముస్లింలు కూడా ఓటు వేస్తే మీరు గెలవలేదా అని నిలదీశారు. చంద్రబాబు ముస్లిం ద్రోహిగా అభివర్ణించారు. 'ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తే సరిపోదు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు. ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లిం లకు వెన్నుపోటు పొడిచారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి పెట్టిన ఇఫ్తార్‌లో చంద్రబాబు విషం కలిపారు' అని చంద్రబాబుపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డిల్లీలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరుగుతుంటే.. ఇక్కడ వక్ఫ్ బోర్డు మీద సమీక్ష పెట్టారు. ఇది ఊసరవెళ్లి రాజకీయం కాదా? అని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు ప్రశ్నించారు. చంద్రబాబు మీ మొహం ముస్లింలకు ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. 'దేశంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసే కుట్ర నే ఈ సవరణలు. బోర్డు అధికారాలు ప్రత్యేక అధికారికి ఇవ్వడం ఏంటి? బోర్డ్‌లో నాన్ ముస్లిం లను పెట్టడం ఏమిటి? హిందూ, సిక్కు దేవాలయాల బోర్డులో ముస్లింలను పెడతారా?' అంటూ బీజేపీకి షర్మిల ప్రశ్నలు సంధించారు.

'వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను పెట్టి వారికి తీరని ద్రోహం చేశారు. సవరణలు అన్ని కూడా ముస్లింలకు అన్యాయం చేసేవే. ముస్లిం లా బోర్డ్ పరిధిలో న్యాయం జరిగే పరిస్థితి నుంచి హైకోర్టుకి తెచ్చారు. ఏ సమస్య లేనిది ఇప్పుడు ఈ సవరణ ఎందుకు?' అని షర్మిల ప్రశ్నించారు. వక్ఫ్ సవరణలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు షర్మిల ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News