
AP DSC 2025 Exams Postpone: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ వేశారని.. వేసిన డీఎస్సీని అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అంశంలో నిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలిపారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం సరికాదని.. వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలకు మరింత గడువు ఇవ్వాలని కోరారు.
రేపటి నుంచి డీఎస్సీ పరీక్షల ప్రారంభంపై 'ఎక్స్' వేదికగా వైఎస్ షర్మిల స్పందించారు. 'డీఎస్సీ విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని విమర్శించారు.
'కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని.. 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల పట్ల కనికరం చూపాలి' అని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. పరీక్షల వాయిదాకు అభ్యర్థులు లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే కనికరించకపోవడం దారుణంగా పేర్కొన్నారు. నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమని వైఎస్ షర్మిల అభివర్ణించారు. డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందరపాటు నిర్ణయానికి అద్ధం పడుతుందని నారా లోకేశ్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
'డీఎస్సీ నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. '90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి' అని విజ్ఞప్తి చేశారు. 'నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా డీఎస్సీ పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలి' అని నారా లోకేశ్‌ను వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని… pic.twitter.com/NCiwiJK4J5
— YS Sharmila (@realyssharmila) June 5, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి