)
YS Sunitha: హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. తన తండ్రి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరిగా అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఆరేళ్లు గడిచిపోయాయని, అయినా కేసు మాత్రం కొలిక్కి రాలేదంటూ సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసును సీబీఐ తిరిగి దర్యాప్తు చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు సునీత. అయితే కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు.వివేకాను చంపిన నిందితుల్లో ఒక్కరు మినహా అందరూ బెయిల్‌పై బయటే తిరుగుతున్నారని, సాక్షులు మాత్రం చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షులను వాగ్మూలం వెనక్కి తీసుకోవాలంటూ నిందితులు హడలెత్తిస్తున్నారని ఆరోపించారు. ఇన్నేళ్లయినా తమ కుటుంబానికి న్యాయం జరగడం లేదని, నిందితులకు కఠిన శిక్ష పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ సునీత.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe