YS Sunitha: ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడిలో గాయపడిన సీఎం జగన్‌కు ఆయన చెల్లెలు కీలక సహాయ ఇచ్చింది. రాజకీయాలు పక్కనపెట్టి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సూచన చేసింది. రాళ్ల దాడిలో అయిన దెబ్బకు వేసుకున్న బ్యాండేజ్‌ తీసేయాలని తెలిపారు. లేకపోతే సెప్టిక్‌ అవుతుందని హెచ్చరించారు. అనంతరం రాజకీయ విమర్శలు చేశారు. తన తండ్రి హత్యపై జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Amit Shah: రేవంత్‌ రెడ్డిపై అమిత్‌ షా ఫైర్‌.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌ చేశారని తీవ్ర వ్యాఖ్యలు


 


పులివెందులో నామినేషన్‌ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన బాబాయ్‌ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై స్పందించారు. హత్య విషయంలో తన చెల్లెలు సునీతపై కూడా విమర్శించారు. తనపై చేసిన విమర్శలపై గంటల వ్యవధిలోనే సునీత స్పందించారు. 'అన్న జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో మా నాన్న వివేకాపై ద్వేషం కనిపిస్తోంది. ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత ద్వేషం. మీ కోసం త్యాగం చేశారు కాబట్టే వివేకాపై కోపమా?' అని ప్రశ్నించారు.

Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్‌ చేస్తా: కేసీఆర్


 


'సీఎం జగన్‌కు న్యాయ వ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదు. ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలి. హత్యపై మాట్లాడవద్దంటూ కోర్టు ఆర్డర్‌ తెచ్చిన వాళ్లే మాట్లాడుతున్నారు. సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయవద్దు. తప్పు చేసి ఉంటే నాకైనా.. నా భర్తకైనా శిక్ష పడాల్సిందే. అవినాశ్‌ రెడ్డి చిన్న పిల్లోడని చెబుతున్నారు. ఎంపీ పదవులు పిల్లలకు ఇస్తారా? సీబీఐ నిందితులు అన్న వాళ్లను జగన్‌ ప్రోత్సహిస్తున్నారు. ఐదేళ్లుగా నా తండ్రి హత్యపై పోరాడుతుంటే రాజకీయాలు అంటగడుతున్నారు. ముఖ్యమంత్రిని ప్రాథేయపడుతున్నా. ఇప్పటికైనా నా పోరాటానికి సహాయం చేయండి' అని కోరారు.


'జగనన్న ఇక బ్యాండేజ్‌ తీసేస్తే మంచిది. ఎక్కువ రోజులు బ్యాండేజ్‌ ఉంటే గాయం సెప్టిక్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నా. గాలి త్వరగా మానుతుంది' వైఎస్‌ సునీతా రెడ్డి జగన్‌కు సలహా ఇచ్చారు.‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter