YS Vijayamma: గతమెంతో వైభవం.. ప్రస్తుతం శూన్యం మాదిరి వైఎస్ కుటుంబం పరిస్థితి ఎదురైంది. ఆస్తి వివాదం నేపథ్యంలో ఆ కుటుంబ పరువు రోడ్డుపాలైంది. ప్రస్తుతం న్యాయస్థానంలో వీరి ఆస్తుల వివాదం కొనసాగుతుండగా.. విచారణ సమయంలో వైఎస్ విజయమ్మ భారీ ఝలక్ ఇచ్చారు. కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతడి భార్య భారతికి అసలు అర్హతే లేదని తేల్చి చెప్పారు. వాటాలన్నీ తన పేరిట బదిలీ అయ్యాయని న్యాయస్థానంలో విజయమ్మ వాదించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
Also Read: AP Budget: ఏపీ బడ్జెట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలకు ఒక పేజీ?
వైఎస్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో జగన్‌కు చెందిన రూ.74.26 లక్షల వాటా, భారతికి చెందిన రూ.40.50 లక్షల వాటాలను వైఎస్ విజయమ్మ పేరిట బదిలీ అయ్యాయి. వాటాల బదలాయింపుపై వైఎస్ జగన్, భారతి సెక్షన్ 59 కింద జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. గురువారం ఈ కేసు విచారణకు రాగా హైదరాబాద్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ అంశంలో వైఎస్ విజయమ్మ కీలక వాదనలు వినిపించారు.
Also Read: Gorantla Madhav: తర్వాతి అరెస్ట్ గోరంట్ల మాధవ్..? పోలీసుల నోటీసు అందజేత!
'సరస్వతీ లిమిటెడ్‌తో, గిఫ్ట్‌డీడ్‌తో షర్మిలకు సంబంధం లేదు. జగన్, షర్మిలకు కూడా సంబంధం లేదు' బెంచ్ ముందు విజయమ్మ స్పష్టం చేశారు. కొడుకు, కోడలు జగన్, భారతి అనవసరంగా షర్మిలను వాటాల బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారని వాదించారు. కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదాలను ఇక్కడకు తీసుకురావడం అంటే ట్రెబ్యునల్‌ను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా.. నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలా వేధించడం జగన్, భారతిలకు సరికాదని హితవు పలికారు.
సరస్వతీ లిమిటెడ్‌లో జగన్, భారతిలకు వాటాలు లేవని.. మొత్తం 99.75 శాతం వాటాలు తనవేనని వైఎస్ విజయమ్మ బెంచ్‌కు స్పష్టం చేశారు. జగన్, భారతి క్లాసిక్ రియాల్టీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావని.. భారీ జరిమానాతో కొట్టివేయాలని విజయమ్మ కోరారు. జగన్, షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ, వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ పిటిషన్ వేశారని విజయమ్మ పునరుద్ఘాటించారు. సెక్షన్ 59ను చట్టవిరుద్ధంగా వినియోగించలేరని గుర్తుచేస్తూ ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









